Whatsapp Grievance: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సప్‌లో తరచూ సమస్యలు ఎదుర్కొంటున్నారా..ఇప్పుడు మీ సమస్యల్ని పరిష్కరించేందుకు వాట్సప్ ఇండియాలో ఓ అధికారిని నియమించింది. మరి ఆ అధికారికి మీ సమస్యలు ఎలా ఫిర్యాదు చేయాలంటే..
భారతదేశ ప్రభుత్వం ఫిబ్రవరి 25 న ప్రవేశపెట్టిన కొత్త ఐటీ నిబంధనలు (New IT Rules) మే 25 నుంచి అమల్లో వచ్చాయి. దీని ప్రకారం ప్రతి సోషల్ మీడియా సంస్థ ఇండియా మనదేశానికి చెందిన పౌరుల్ని గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, ఛీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్లను నియమించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం వాట్సప్ ఇండియాలో గ్రీవెన్స్ ఆఫీసర్‌గా పరేష్ బి లాల్‌ను నియమించింది. అదృష్టవశాత్తూ వాట్సప్ కొత్త గ్రీవెన్స్ అధికారి కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉండటం విశేషం.
మరి వాట్సప్ (Whatsapp) సమస్యలపై ఆ అధికారికి ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ సమస్యల్ని పోస్టు ద్వారా, ఈ మెయిల్ ద్వారా వాట్సప్ ఫిర్యాదుల అధికారికి పంపించవచ్చు. ఈ మెయిల్ ద్వారా grievance_officer_wa@support.whatsapp.com కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ మెయిల్లో తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఒక నిర్ధిష్టమైన ఖాతా గురించి వాట్సప్‌ను సంప్రదించాలనుకుంటే..తమ ఫోన్ నెంబర్‌ను కంట్రి కోడ్‌తో సహా పూర్తి అంతర్జాతీ. ఫార్మాట్లో ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది.
గ్రీవెన్స్ ఆఫీసర్(Whatsapp Grievance Officer) ను పోస్ట్ ద్వారా సంప్రదించాలనుకుంటే పోస్ట్ బాక్స్ నెంబర్ 56, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్ , హైదరాబాద్-500034, తెలంగాణకు పోస్ట్ చేయవచ్చు. యాప్ సేవా నిబంధనలు, చెల్లింపులు, ఖాతాకు సంబంధించిన ప్రశ్నల్ని గ్రీవెన్స్ అధికారికి విన్నవించవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను 15 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది.
Also read: WhatsApp Stickers: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్, టైప్ చేస్తే చాలు కావాల్సిన స్టిక్కర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook