Reducing Cholesterol with Karela Tea: అధిక కొలెస్ట్రాల్ కారణంగా సిరల్లో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీని కారణంగా చాలా మందిలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ ప్రభావం కారణంగా గుండెపై ఒత్తిడి పెరగడం ప్రారంభమవుతుంది. గుండె ఒత్తిడికి గురవ్వడం వల్ల గుండె పోటు, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రక్తంలో లేదా సిరల్లో పేరుకుపోయిన కొవ్వు కారణంగా ప్రాణాంతకంగానూ మారే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి పలు రకాల చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా చాలా మందిలో రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల ఒక్కసారిగా గుండె ఆగిపోతోంది. కాబట్టి తప్పకుండా అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సకాలంలో పలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే హెర్బల్ టీలను కూడా ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. ఎలాంటి టీలను తాగడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ తగ్గడానికి ఈ ఔషధ టీ తాగండి:
ప్రతి రోజూ కాకరకాయ నుంచి తయారు చేసిన టీని ప్రతి రోజూ తాగితే సిరలలో పేరుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా నియంత్రణలో ఉంటుంది. ఇందులో యాంటీ డయాబెటిక్‌తో పాటు యాంటీ కొలెస్ట్రాల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఖాళీ కడుపుతో తాగితే సులభంగా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కాకర టీని ఎలా తయారు చేయాలో తెలుసా?:
పొడి కాకర ముక్కలు లేదా తాజా ముక్కలను కట్ చేసి నీటిలో ఉడకబెట్టండి. ఆ తర్వాత ఉడకబెట్టిన ఆ నీటిని ఫిల్టర్ చేయండి. అదే కప్పులో నిమ్మరసంతో పాటు.. తేనెను కలిపి తీసుకుంటే శరీరానికి విటమిన్ సీ లభించి చాలా కొలెస్ట్రాల్ పరిమాణాలు సులభంగా తగ్గుతాయి.
కాకర టీ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:
కంటి చూపు పెరుగుతుంది:
కాకరకాయలో విటమిన్ ఎ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపర్చడమేకాకుండా కళ్లకు సంబంధించిన చాలా రకాల సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా విటమిన్ ఎ బీటా-కెరోటిన్ మూలకాలు కూడా ఇందులో లభిస్తాయి కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది:
మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ కాకర టీని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు సులభంగా నియంత్రణలో ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ మధుమేహాన్ని నియంత్రించడానికి ఈ టీని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా బీపీ సమస్యలతో బాధపడేవారికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి
Also read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook