How To Reduce Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం ఆధునిక జీవనశైలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలను విచ్చలవిడిగా తినడం వల్ల కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయపడుతున్నారు. అయితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాలను నియంత్రించి గుండెపోటు సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. ఈ సమస్యల నుంచి సులభంగా విముక్తి పొందడానికి తప్పకుండా పలు రకాల చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి చిట్కాలను వినియోగించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చెడు కొలెస్ట్రాల్ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వీటిని తీసుకోండి:
టమాటో రసం:
టమాటో రసాన్ని చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా తాగొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో శరీరాన్ని కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి దీనిని ప్రతి రోజు తాగడం వల్ల సెల్ డ్యామేజ్‌ను నివారిస్తాయి. అంతేకాకుండా దానిలో పీచు పదార్థాలు, మినరల్స్ అధికంగా ఉంటాయి.. కాబట్టి సులభంగా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సహాయపడతాయి.
అల్లం, వెల్లుల్లి రసం:
అల్లం వెల్లుల్లి లో ఉండే ఔషధ గుణాలు ఇంకా వేటిల్లో లభించవు. అందుకే ఆయుర్వేద శాస్త్రంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే చెడు కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గించుకోవడానికి ప్రతి రోజు వెల్లుల్లిని రసంలా చేసి తాగాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజు రసాన్ని తాగడం వల్ల రక్త సమస్యలతో పాటు కొలెస్ట్రాల్ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
గ్రీన్ టీ:
బరువు తగ్గే క్రమంలో గ్రీన్ టీ ఎలాంటి పాత్ర పోషిస్తుందో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా అంతే పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్ ల పరిమాణాలు అధికంగా ఉండడం వల్ల సులభంగా శరీర బరువును నియంత్రిస్తాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Income tax Slabs: ఇన్‌కంటాక్స్ స్లాబ్ ఎన్ని రకాలు, ఏ ప్లాన్‌లో ఎంత ట్యాక్స్ చెల్లించాలి
Also read: Income tax Slabs: ఇన్‌కంటాక్స్ స్లాబ్ ఎన్ని రకాలు, ఏ ప్లాన్‌లో ఎంత ట్యాక్స్ చెల్లించాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook