Manchu Family Pays Tribute to Kaikala టాలీవుడ్‌లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ వంటి వారు తుది శ్వాస విడిచారు. ఇప్పుడు సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో కైకాల కన్నుమూసినట్టు తెలుస్తోంది. ఇక కైకాల మరణ వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
కైకాల సత్యనారాయణ గారు ఈ లోకాన్ని వదిలి వెళ్లారనే వార్త నన్ను ఎంతో కలిచి వేసింది. మీరు మాతో ఉండే క్షణాలు, మీ చుట్టూ ఉండే పాజిటివ్ ఆరాను మిస్ అవుతున్నాం సర్.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్ వేశాడు.
కైకాల వేయని పాత్ర లేదని, దుర్యోధనుడు, ఘటోత్కచుడు, యముడు ఇలా అన్ని పాత్రలు వేశారని అటు వంటి మహానటుడు అని చెప్పుకొచ్చాడు. ఆయన మరణం బాధాకరమని, ఆయన లోటు తీర్చలేదని అన్నాడు. ఏ రోజూ ఇంత పారితోషికం కావాలని అడగలేదట. ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనూ తన కోసం నటించారని, పెదరాయుడు సినిమాలో చిన్న పాత్రే అయినా మరిచిపోలేని పాత్ర అని గుర్తు చేసుకున్నాడు.
కైకాల సతీమణి తనను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తుండేదట.. తాను అక్కయ్య అని పిలుస్తాడట.. కైకాల మన మధ్య లేకపోవడం బాధాకరమైన విషయమని మోహన్ బాబు ఎమోషనల్ అయ్యాడు. ఇక మంచు లక్ష్మీ స్పందిస్తూ.. కైకాల సత్యనారాయణ గారి అకాల మరణం నన్ను ఎంతో బాధించింది.. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. ట్వీట్ వేసింది.
మంచు విష్ణు స్పందిస్తూ.. ఆయన ఓ లెజెండ్, నటనలో ఆయన ఓ గైడ్ వంటి వారు.. ఆయన ఎన్నో రకాల పాత్రలు పోషించారు.. అవన్నీ కేవలం ఆయన మాత్రమే పోషించగలరు.. సెట్స్ మీద లయన్‌లా గర్జించేవారు.. ఆయన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం అని ట్వీట్ వేశాడు. కైకాల సత్యనారాయణ గారి మరణ వార్త విని నాకు ఎంతో బాధ కలిగింది.. సినీ పరిశ్రమకు ఆయన చేసిన విశేష కృషి ఎప్పటికీ మరువలేనిది.. అంటూ మంచు మనోజ్ సంతాపం వ్యక్తం చేశాడు.
Also Read : Nayanthara Surrogcay : ఈ ఏడాదిలో పెళ్లై, తల్లైన హీరోయిన్లు వీరే.. సహజగర్భంతో వాళ్లు, సరోగసితో నయన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook