AP Government: సంపద కోసం బాండ్లు అమ్మేస్తున్న ఏపీ ప్రభుత్వం, మరో 5 వేల కోట్లు

AP Government: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అప్పుల సమీకరణకు నడుం బిగించింది. ఆధాయ వనరుల కోసం ప్రత్యామ్నాయం లేకపోవడంతో రుణాలపై ఆధారపడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 28, 2024, 10:19 AM IST
AP Government: సంపద కోసం బాండ్లు అమ్మేస్తున్న ఏపీ ప్రభుత్వం, మరో 5 వేల కోట్లు

AP Government: ఎన్నికల సమయంలో ఆదాయం కోసం సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వానికి వాస్తవం అర్ధమౌతున్నట్టుంది. షరా మామూలే అన్నట్టుగా ఆదాయం కోసం రుణాలపై ఆధారపడుతోంది. అధికారంలో వచ్చినప్పట్నించి ఆదాయం కోసం రుణాలు తీసుకుంటూనే ఉంది. ఇప్పుడు మరోసారి బాండ్లను వేలానికి పెట్టింది. 

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక సంపద సృష్టి సంగతేమో గానీ రుణాల సమీకరణ అధికంగా ఉంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు అవసరమైన నిధుల్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా రుణాల సమీకరణ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు సెక్యూరిటీ బాండ్లు, స్టాక్స్ వేలం పెట్టింది. దశలవారీగా వేల కోట్ల రూపాయలు విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. ఇప్పటి వరకూ బాండ్లు, స్టాక్స్ వేలం ద్వారా 15 వేల కోట్ల రూపాయలు సమీకరించుకుంది. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేస్తోంది. ఈసారి చంద్రబాబు ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలు సమీకరించేందుకు సిద్ధమైంది. దీనికోసం మూడు స్టాక్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద వేలానికి పెట్టింది. 

ఏపీ ప్రభుత్వం వేలానికి పెట్టిన స్టాక్స్ వివరాలు

ఒక స్టాక్ 2 వేల రూపాయల విలువైంది కాగా మిగిలిన రెండింటిలో ఒక్కొక్కటి 1500 కోట్ల రూపాయల విలువైనవి. ఈ స్టాక్స్ ఈ నెల 31న వేలానికి రానున్నాయి. ఆర్బీఐ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ద్వారా వేలం కొనసాగనుంది. కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ బిడ్స్ రూపంలో విక్రయమౌతాయి. ఈ స్టాక్స్ కాల వ్యవధి ఒకటి 12 ఏళ్లు కాగా రెండవది 13 ఏళ్లు, మూడవది 14 ఏళ్లుగా ఉన్నాయి. ఈ స్టాక్స్ ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 31వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ ఓపెన్‌లో ఉంటాయి.

అత్యధికంగా వేలం పెట్టింది ఏపీనే

ఆదాయం కోసం బాండ్లు, స్టాక్స్ వేలానికి పెట్టడం సహజంగా జరిగే ప్రక్రియే. కానీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏపీ అత్యధికంగా 15 వేల కోట్లు వేలం పెట్టింది. ఇప్పుడు మరో 5 వేల కోట్లు వేలానికి పెడుతోంది. హర్యానా 1000 కోట్లు, జమ్ము కశ్మీర్ 320 కోట్లు, కర్ణాటక 4 వేల కోట్లు, మధ్యప్రదేశ్ 5 వేల కోట్లు, పంజాబ్ 500 కోట్లు, రాజస్థాన్ 500 కోట్లు, తెలంగాణ 409 కోట్ల కోసం స్టాక్స్ వేలానికి పెట్టగా ఉత్తరప్రదేశ్ 3 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్ 2500 కోట్లు సమీకరించనుంది.

Also read: SBI PO Jobs: నిరుద్యోగులకు శుభవార్త, ఎస్బీఐలో భారీగా పీవో పోస్టుల భర్తీ, ఎలా అప్లై చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News