Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర.. నేడు తులం రేటు ఎంత ఉందంటే?

Gold Price Today: మహిళలకు శుభవార్త. 3 రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. భారీగా పెరుగుతూ పసిడిప్రియులను భయబ్రాంతులకు గురిచేసిన బంగారం ధరలు నేడు కాస్త దిగిరావడంతో ఊరట కల్పించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగిరావడంతో దేశీయంగానే ధరలు తగ్గిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నేడు డిసెంబర్ 29వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

1 /8

Gold Price Today: బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. బంగారం కొనుగోలు చేసేందుకు పసిడి ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు.రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనేది పక్కన పెడితే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటంతో వీలైనంత వరకు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.

2 /8

ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్, పండగల సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు సంక్రాంతి పండగ వస్తున్న క్రమంలో చాలా మంది బంగారం కొనాలనే ప్లాన్ లో ఉన్నాయి.   

3 /8

అయితే దేశీయంగా బంగారం ధరలకు గిరాకీతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు,భౌగోళిక అంశాలు, ఆర్థిక పరమైన నిర్ణయాలు వంటి ఎన్నో అంశాలు మడిపడి ఉన్నాయి. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్లలో ధరలు ప్రభావితం చేస్తుంటాయి. ఈ క్రమంలో డిసెంబర్ 29వ తేదీ ఆదివారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

4 /8

అంతర్జాతీయ మార్కెట్లో నేడు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడురోజుల పాటు పెరిగి నేడు దాదాపు 50 డాలర్లపైగా తగ్గింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2621 డాలర్ల దగ్గర కొనసాగుతోంది.

5 /8

ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 29. 42డాలర్ల దగ్గర ఉంటుంది. రూపాయి మారకం విలువ రోజురోజుకు పడిపోతుంది.   

6 /8

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజులు పాటు వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు తగ్గడం కాస్త ఊరట కల్పించినట్లయ్యింది.

7 /8

నేడు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.150మేర తగ్గింది. దీంతో 71,350 దగ్గరకు దిగివచ్చింది. ఇక 24క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 10 గ్రాములపై రూ. 160తగ్గి 77, 840 వద్దకు దిగింది.   

8 /8

దేశీయ మార్కెట్లో బంగారం ధరలతోపాటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఇటీవల కిలో వెండి ధర మళ్లీ లక్ష రూపాయల మార్కెట్ దాటిందని ఆందోళన కలిగించిన విషయం తెలిపిందే. నేడు కిలో రూ. 100తగ్గింది. దీంతో కిలో ధర రూ. 99,900కు దిగివచ్చింది.