Bandla Ganesh Tweet on Cheating Goes Viral: వివాదాస్పద నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ పరిశ్రమలో ఒక నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన తరువాత అనేక రకాల పనులు చేస్తూ సినిమా మేనేజర్ స్థాయికి కూడా వెళ్లారు. తర్వాత కమెడియన్ గా మంచి పేరు రావడంతో పాటు కాస్త డబ్బు కూడా వెనకేసుకోవడంతో నిర్మాతగా మారారు.
నిర్మాతగా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, జూనియర్ ఎన్టీఆర్ తో బాద్షా, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో వంటి సూపర్ హిట్ సినిమాలు తీయడమే కాక సచిన్ జోషి, పొట్లూరి వరప్రసాద్ వంటి వారితో వివాదాలకు కూడా వెళ్లి అనూహ్యంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే అలాంటి బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అనేక కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
విజయసాయిరెడ్డి మొదలు ఒక ఫిలిం జర్నలిస్టు దాకా ఎవరిని వదలకుండా తనదైన శైలిలో వారందరికీ కౌంటర్లు ఇస్తూ రీ ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన మోసం గురించి చేసిన ఒక ట్వీట్ అయితే చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే పదేపదే వ్యక్తులతో మోసపోతున్నామంటే అది మోసం చేసిన వాళ్ల తప్పు కాదు, నమ్ముతున్న మన అందరి తప్పు అంటూ ఆయన ట్వీట్ చేశారు.
సరే కదా అని మౌనంగా ఉన్నామంటే అది ఇంకా తప్పని బండ్ల గణేష్ పేర్కొన్నారు. మోసం చేసినోడి గురించి తెలుసుకోండి వాడికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయండి, దేనికైనా సమాధానం ఒక్కటే సరైన నిర్ణయం అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. నిజానికి బండ్ల గణేష్ తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించారని బండ్ల గణేష్ ప్రకటించుకున్నారు కానీ ఆ ప్రాజెక్టు ఎక్కడి వరకు వచ్చిందో దర్శకుడు ఎవరో కూడా తెలియని పరిస్థితి.
ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదని అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో తాను మోసపోయాను అని అర్థం వచ్చేలా బండ్ల గణేష్ ఇలా కామెంట్లు చేస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ అందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియదు. బండ్ల గణేష్ ఇప్పటికీ తనను తాను పవన్ కళ్యాణ్ వీరభక్తుడు గానే చెప్పుకుంటూ ఉంటారు కానీ ఎందుకో ఆయన పదే పదే చేస్తున్న కామెంట్లు ట్వీట్లు ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి.
Also Read: Nayanthara : అందుకే ప్రమోషన్లకు రావడం లేదు.. నోరు విప్పిన నయనతార.. నయన్ బాధ అదేనా?
Also Read: Prabhas Wig: ప్రభాస్ ది కూడా విగ్గేనా.. అసలు విషయం ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.