Blood Pressure: ఈ పద్ధతులు పాటిస్తే..అధిక రక్తపోటుకు మందుల అవసరం ఉండదు

Blood Pressure: నిత్యం ఎదుర్కొనే పలు రోగాల్లో ఒకటి అధిక రక్తపోటు సమస్య. హైపర్ టెన్షన్‌గా పిలుస్తారు. ఇదొక ప్రాణాంతక వ్యాధి. కొన్ని పద్ధతి పాటించడం ద్వారా రక్తపోటును కచ్చితంగా నియంత్రించవచ్చంటున్నారు వైద్య నిపుణులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 8, 2022, 11:47 PM IST
Blood Pressure: ఈ పద్ధతులు పాటిస్తే..అధిక రక్తపోటుకు మందుల అవసరం ఉండదు

ఆధునిక జీవన విధానంలో ఎదురౌతున్న కొన్ని ప్రత్యేక ప్రమాదకర వ్యాధుల్లో ఒకటి అధిక రక్తపోటు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించడమే కాకుండా...ప్రాణాంతకం కాగలదు. అందుకే బీపీ ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

అధిక రక్తపోటునే హైపర్ టెన్షన్‌గా పిలుస్తారు. ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా..నియంత్రణలో లేకపోయినా ప్రాణాంతక వ్యాధి అవుతుంది. బీపీకు చికిత్స చాలా అవసరం. కానీ కొన్ని సహజసిద్ధమైన పద్ధతులతో రక్తపోటును నియంత్రించడం సాధ్యమేనంటున్నారు వైద్య పండితులు. హై బీపీ ఉన్నప్పుడు ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురౌతుంది. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య రావచ్చు. బీపీ సమస్య ఉన్నప్పుడు తక్షణం చికిత్స చేయించాలి. కొన్ని అంశాల్ని పరిగణలో తీసుకుంటే..రక్తపోటును నియంత్రించవచ్చు.

అధిక రక్తపోటును ఎలా నియంత్రించడం

భోజనంలో ఉప్పు తగ్గించడం

తినే ఆహార పదార్ధాల్లో ఉప్పు ఎక్కువైతే సహజంగానే రక్తపోటు పెరుగుతుంది. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్లనే రక్తపోటు సమస్య వస్తుంటుందని వైద్యులు చెబుతుంటారు. సోడియం తక్కువగా ఉన్నట్టు జాగ్రత్తలు తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

పౌష్టిక ఆహారం అవసరం

అధిక రక్తపోటు ఉన్నప్పుడు పౌష్ఠిక ఆహారం తప్పకుండా తీసుకోవాలి. డైట్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. ఇందులో పొటాషియం మెగ్నీషియం, కాల్షియం వంటి మినరల్స్ ఉండేట్టు చూసుకోవాలి. ఇలాంటి ఆహారం తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

టెన్షన్ తగ్గించుకోవడం

టెన్షన్, ఒత్తిడి కారణంగా కూడా రక్తపోటు సమస్య పెరుగుతుంది. ఈ క్రమంలో సంబంధిత వ్యక్తి ఎక్కువ ఒత్తిడికి లోనుకాకుండా జాగ్రత్త పడాలి.

రోజూ ఎక్సర్‌సైజ్

ఎక్సర్‌సైజ్ లేదా వ్యాయామం ప్రతి వ్యక్తికి లాభదాయకం. ఈ క్రమంలో రక్తపోటు సమస్య  ఉన్న వ్యక్తి తప్పకుండా వ్యాయామం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. రోజుకు అరగంట వ్యాయమం తప్పనిసరి.

Also read: Weight Loss: హఠాత్తుగా మీరు బరువు తగ్గుతున్నారా..అయితే అది ప్రాణాంతకం కావచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News