Mars Transit in Aries 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గమనం వ్యక్తుల స్థితిగతులను ప్రభావితం చేస్తుంది. కొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలనిస్తే.. మరికొన్ని గ్రహాలు ప్రతికూల ఫలితాలనిస్తాయి. గ్రహాల రాశి మార్పు సమయంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే గ్రహాల మార్పు గురించి ముందే తెలుసుకుని.. చెడు ప్రభావాల నుంచి బయటపడేందుకు కొందరు పరిహారాలు కూడా చేస్తారు. ఈ నెల 27న కుజ గ్రహం మేష రాశిలోకి మారనుంది. ఆగస్టు 10 వరకు కుజుడు మేష రాశిలోనే సంచరిస్తాడు. ఈ ప్రభావం 3 రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. ఆ రాశులేంటో.. వారికి కలిగే అదృష్ట ఫలాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
ఆ 3 రాశులు.. వారికి కలిగే అదృష్టం ఇదే.. :
మిథునం : కుజుడు మేష రాశిలో సంచరించే కాలం మిథున రాశివారికి ఆర్థికంగా కలిసొస్తుంది. ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఖర్చులు పెరిగినప్పటికీ.. ఆదాయం కూడా పెరగడంతో ఆ ప్రభావం కనిపించదు. మీ శక్తి, సామర్థ్యాలు మెరుగవుతాయి. కుటుంబ బంధాలు బలపడుతాయి. జీవిత భాగస్వామితో ప్రేమ మరింత వికసిస్తుంది.
కర్కాటకం: కర్కాటక రాశి వారి కెరీర్లో ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగ అవకాశాల రీత్యా,వ్యాపార విస్తరణ రీత్యా సత్ఫలితాలు ఉంటాయి. డబ్బుకు లోటు ఉండదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా డబ్బు వస్తుంది. చేపట్టిన ప్రతీ పనిని ఆస్వాదిస్తారు. మనసు పెట్టి పనిచేస్తే అన్నింటా విజయం సాధిస్తారు.
సింహం : ఈ రాశి వ్యాపారస్తులకు అనుకూల సమయం. ప్రతీ పనిలో అదృష్టం వెన్నంటే ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవడంతో పాటు లాభాలు తీసుకొస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ధనం రావడమే తప్ప పోవడం ఉండదు. విద్యార్థులు పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Liger Trailer: విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది... రౌడీ స్టార్ నెక్ట్స్ లెవల్ అంతే..
Also Read: Railway Shock:సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రైల్వేశాఖ షాక్?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook