Russia Ukraine war: ''రష్యా చేస్తున్నది తప్పు... వెంటనే యుద్ధం ఆపేయండి''.. సొంత దేశంపై టెన్నిస్ స్టార్ సంచలన వ్యాఖ్యలు

Russia Ukraine crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఆ దేశ టెన్నిస్ ఆటగాడు ఖండించాడు. దుబాయ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ కు చేరిన రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్‌ పలు వ్యాఖ్యలు చేశాడు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2022, 02:41 PM IST
Russia Ukraine war: ''రష్యా చేస్తున్నది తప్పు... వెంటనే యుద్ధం ఆపేయండి''.. సొంత దేశంపై టెన్నిస్ స్టార్ సంచలన వ్యాఖ్యలు

Russia Ukraine crisis: రష్యా, ఉక్రెయిన్ మద్య భీకర యుద్ధం (Russia Ukraine war) జరుగుతోంది. ఉక్రెయిన్ రాజధాని  కీవ్‌ను హస్తగతం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా వైఖరిని ఖండించాడు ఆ దేశ స్టార్‌ టెన్నిస్‌ ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్‌ (Andrey Rublev). యుద్దాన్ని వెంటనే ఆపేయాలని.. శాంతి పద్దతిలో చర్చలు జరపాలని సూచించాడు. 

దుబాయ్‌ చాంపియన్‌షిప్‌లో (Dubai Championships 2022) రష్యా టెన్నిస్ ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్ ఫైనల్‌కు చేరాడు. సెమీఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం టీవీ కెమెరాలో 'నో వార్ ప్లీజ్' అని రాసి..తన సంఘీభావాన్ని ప్రకటించాడు.. శుక్రవారం పొలాండ్‌కు చెందిన హుబెర్ట్ హుర్కాజ్‌తో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడాడు రుబ్లెవ్. మ్యాచ్‌లో 3-6,7-5,7-6(5)తో హుర్కాజ్‌ను ఓడించి రుబ్లెవ్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. కాగా విజయం అనంతరం మీడియాతో మాట్లాడాడు.

''నా సొంత దేశం రష్యా చేస్తున్నది తప్పు. బలం లేని చిన్న దేశంపై దాడికి దిగడం మంచి పద్దతి కాదు. మ్యాచ్‌ గెలిచినప్పటికి నాకు సంతృప్తి లేదు. నా గెలుపును యుద్ధంలో మరణించిన ఉక్రెయిన్‌ వాసులకు అంకితం చేస్తున్నా. ఇప్పటికైనా యుద్ధం ఆపేయండి.'' అంటూ రుబ్లెవ్‌ చెప్పుకొచ్చాడు. 

Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై UN భద్రతా మండలిలో ఓటింగ్‌.. భారత్, చైనా దూరం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News