Bhamakalapam review: పెళ్లి తర్వాత రెగ్యులర్ స్టోరీలు కాకుండా.. డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ కెరీస్ను సాగిస్తోంది నటి ప్రియమణి. ఇందులో భాగంగా అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పుడు తెలుగులో తాజాగా ఓ సినిమా చేసింది. నేరాగా ఓటీటీలో విడుదలైంది ఈ సినిమా. 'భామా' కలాపం పేరుతో ఈ సినిమా ఆహాలో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏమిటి? ఎవరెవరు ఎలా చేశారు? అనేది తెలుసుకుందాం.
సినిమా గురించి..
ఈ సినిమాలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించగా.. శరణ్య, కంచరపాలే కిశోర్, శాంతిరావు, జాన్ విజయ్, పాడియన్, ప్రధీప్ రుద్ర, సమీర, రవీందర్ బొమ్మకంటి సహా పలువురు నటించారు.
ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్‌లు ఈ సినిమాను నిర్మించారు.
కథ ఏమిటంటే..
మర్డర్ మిస్టరీ కథలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. ఇదే కథాంశంతో 'భామా కలాపం' తెరెక్కింది.
ఈ సినిమా మొత్తం వంటల ఛానల్ నుడపుకునే యూట్యూబర్ అనుపమ (ప్రియమణి) చట్టూ తిరుగుతుంది. అనుమపమకు ట్యూబర్‌తో పాటు.. పక్కింట్లో గొడవలు తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల వచ్చే సమస్యలతో ఇంట్లో భర్తతో సహా ఇరుగు పొరుగు వాళ్ల నుంచి కూడా తిట్లు తింటుంది.
అయినా అనుపమ తన పంథా మార్చుకోకుండా.. పక్కింటి విషయాల్లో తలదూర్చుతుంది. ఆ అలవాటు వల్ల తమ అపార్ట్మెట్లో ఓ హత్యకేసులో ఇరుక్కుటుంది అనుపమ. ప్రియమణి అందులో నుంచి ఎలా బయటపడుతుంది? ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనుపమ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? ఇక సినిమాలో రూ.200 కోట్ల విలువైన గుడ్డు కథేమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉంది?
అభిమన్యూ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలుగుల హత్య కేసులో ఇరుక్కోవడం సినిమాలు చాలా వచ్చాయి. ముఖ్యంగా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మత్తు వదలరా వంటి సినిమాలు ఇలాంటి కథాంశాలతోనే వచ్చాయి.
అయితే భామా కలాపం కూడా ఇలాంటి కోవలోనే వచ్చినా కాస్త డిఫరెంట్‌గా ఉందని చెప్పొచ్చు. కథ పూర్తిగా కొత్త రకం కాకపోయినా ట్విస్టులు ఆశ్యర్యపరుస్తాయి. ఇక క్లైమాక్స్ మరింత కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు మంచి అనుభూతిని ఫీలవుతారు.
సినిమా నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉండటం కలిసొచ్చింది. సినిమాలో అనుపమ పాత్రకు ప్రియమణి పూర్తి న్యాయం చేసింది. సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ తోడైంది.
Also read: Prema Entha Madhuram: వాలెంటైన్స్ డే స్పెషల్.. రియల్ కపుల్స్‌తో ప్రేమ ఎంత మధురం టైటిల్ సాంగ్..
Also read: Hero Vishal Injured: సినిమా షూటింగ్లో గాయపడ్డ హీరో విశాల్.. చేతి ఎముక ఫ్రాక్చర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook