Co-Win Registration For COVID-19 vaccination | కరోనా వ్యాక్సినేషన్ కోసం భారతదేశ యువత ఎదురుచూస్తోంది. గత కొన్ని రోజులుగా కరోనా బారిన పడుతున్న కేసులలో అధికంగా యువత, మధ్య వయసు వారి నుంచి నమోదయ్యాయి. కోవిడ్19 మరణాలు సైతం 20 నుంచి 45 ఏళ్ల వయసు వారిలో అధికంగా నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైడిన అందరికీ దేశ వ్యాప్తంగా కరోనా టీకాలకు అర్హులుగా ప్రకటించింది.
కరోనా టీకాలకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు యువత సిద్ధంగా ఉన్నారు. నేటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం నుంచే కోవిన్ యాప్, వెబ్సైట్లలో కోవిడ్19 టీకాల రిజిస్ట్రేషన్ కోసం చూస్తున్నారు. అయితే తొలుత రిజిస్ట్రేషన్ సమయం చెప్పకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తతున్నాయి. ఏప్రిల్ 28న (బుధవారం) సాయంత్రం 4 గంటల నుంచి కరోనా టీకాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆరోగ్య సేతు అదికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
Also Read: Telangana COVID-19 Updates: ఒక్కరోజులో 56 కరోనా మరణాలు, నైట్ కర్ఫూలో పెరిగిన కేసులు
18 ఏళ్లు పైబడిన వారికి దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు మే 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 28న సాయంత్రం 4 గంటల నుంచి కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. కోవిడ్19 టీకాల కోసం కొవిన్ యాప్(CoWIN), ఆరోగ్య సేతు యాప్ (Aarogya Setu App), ఉమాంగ్ యాప్ (UMANG App)ల ద్వారా ఆసక్తిగల వారు కరోనా టీకాలు తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
కాగా, భారతదేశంలో జనవరి 16, 2021 నుంచి తొలి దశలో కరోనా వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా ప్రారంభించారు. హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు టీకాలు ఇచ్చారు. రెండో దశలో మార్చి 1, ఏప్రిల్ 1న ప్రారంభించారు. 45 ఏళ్లు పైబడిన అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, 45 ఏళ్లు పైబడిన దేశ ప్రజలు అందరికీ రెండో దశలో కరోనా టీకాలు ఇచ్చారు. మే 1వ తేదీ నుంచి మూడో దశలో 18 ఏళ్లు పైబడిన దేశ పౌరులు అందరికీ కోవిడ్19 టీకాలు ఇవ్వనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ కరోనా టీకాల ఉత్పత్తిదారులైన సీరం సంస్థ, భారత్ బయోటెక్ సంస్థలు ఒక్కో టీకా డోసుకు ధరలను ప్రకటించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook