టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా (Rana Daggubati), మిహికా బజాజ్ (Miheeka Bajaj)లు ఆగస్టు 8న వివాహబంధంతో ఒక్కటి కావడం తెలిసిందే. ఆ తర్వాత రానా ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి కారణంగా కుటుంబ సభ్యులతో పాటు కేవలం కొందరు అతిథులు మాత్రమే ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే వివాహం తర్వాత రానా, మిహికా అప్‌డేట్స్ కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తన భర్త రానా కోసం మిహికా చేసిన ఓ ప్రత్యేకమైన సందేశం పోస్టు (Miheeka Bajaj Special Message to Rana Daggubati) వైరల్ అవుతోంది. Botsa Satyanarayana: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం
రానాతో కలిసి దిగిన ఓ ఫొటోను మిహికా పోస్ట్ చేసింది. ‘మై లవ్, మై లైఫ్, మై హార్ట్, మై సోల్.. నా సర్వస్వం మొత్తం నువ్వే అయినందుకు ధన్యవాదాలు. ఇందుకోసం ఎన్నో కలలు కన్నాను. జీవితంలో నన్ను ఉన్నతమైన వ్యక్తిగా మలిచావు. ఐ లవ్ యూ రానా’ అని భర్త దగ్గుబాటి రానాపై కొత్త పెళ్లికూతురు మిహికా స్పెషల్ పోస్ట్ చేసింది. Dhoni Retirement: ఎంఎస్ ధోనీ కెరీర్ ఎలా మొదలైందో అలాగే ముగిసింది
అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..