Donald Trump As President of US: నేడే రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం.. స్పెషాలిటీస్ ఇవే..

Donald Trump As President of America: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ నేడు  ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. గడ్డకట్టే చలిలో...అంటే మైనస్‌ 11 డిగ్రీల సెల్సియస్‌ లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా  ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు. ఈ సారి ప్రత్యేకతలు ఇవే..

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 20, 2025, 01:00 AM IST
Donald Trump As President of US: నేడే రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం.. స్పెషాలిటీస్ ఇవే..

Donald Trump As President of America: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అమెరికా రాజధాని వాషింగ్టన్ లో అంతా సిద్ధమైంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 78 ఏళ్ల ట్రంప్‌ అమెరికాకు  47వ అధ్యక్షుడిగా నేడు ప్రమాణం చేయనున్నారు. 82ఏళ్ల జో బైడెన్‌ నుంచి ఆయన అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు.చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్‌ హిల్‌లోని రోటుండా ఇండోర్‌ ఆవరణలో ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. దీంతో ఈ ప్రాంతాన్ని ఎంతో అందంగా అలకరించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా  నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేశం వ్యాప్తంగా ఉన్న వేల మంది రిపబ్లికన్‌ పార్టీ అభిమానులు వాషింగ్టన్‌ చేరుకుంటున్నారు.  అయితే ఇండోర్‌ ఆవరణలో ప్రమాణం కారణంగా గతంలోలా వేల మంది ప్రత్యక్షంగా ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేని పరిస్థితి నెలకొంది.  వారంతా ఎక్కడికక్కడ సంబరాల్లో పాల్గొంటారు.

ట్రంప్ ప్రమాణస్వీకారానికి కేవలం ముఖ్య అథిదులు మాత్రమే హాజరవుతారు. 8ఏళ్ల కిందట ట్రంప్‌ తొలిసారిగా ప్రమాణం చేసినప్పుడు వేల మంది అటెంట్ అయ్యారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకార సంబరాలు శనివారం నుంచే స్టార్ట్ అయ్యాయి. ఫ్లోరిడా నుంచి వర్జీనియాలోని స్టెర్లింగ్‌లో ఉన్న ట్రంప్‌ నేషనల్‌ గోల్ఫ్‌ క్లబ్‌కు చేరుకున్న ఆయన సాయంత్రం విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటాకులు పేల్చారు. అదే టైంలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వాన్స్‌ వాషింగ్టన్‌లో క్యాబినెట్‌ సహచరులతో విందులో పాల్గొన్నారు.

ట్రంప్‌....ఆర్లింగ్టన్‌ జాతీయ స్మారకం దగ్గర జరిగే కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఆ తర్వాత వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ వన్‌ ఎరీనా వద్ద ర్యాలీకి హాజరయ్యారు. నేడు ప్రమాణ స్వీకారం  సందర్భంగా సెయింట్‌ జాన్స్‌ ఎపిస్కోపల్‌ చర్చిలో ప్రార్థనలతో ట్రంప్‌ కార్యక్రమం
షురూ అవుతోంది. అక్కడి నుంచి వైట్ హౌస్  కి వెళ్లి అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలుగుతున్న బైడెన్, ఆయన సతీమణి ఇచ్చే టీ పార్టీలో   పాల్గొంటారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసే క్యాపిటల్‌ హిల్‌కు వస్తారు. అక్కడ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత...దేశ ప్రజలను ఉద్దేశించి తొలి ప్రసంగం చేయనున్నారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత బైడెన్, కమలా హారిస్‌లకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎక్స్, టెస్లాల అధినేత ఎలాన్‌ మస్క్, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్, టిక్‌టాక్‌ సీఈవో షౌ జీ చ్యూ త తో పాటు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు, భారత దేశం తరుపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ హాజరవుతారు. ప్రమాణం చేశాక కొన్ని కీలక ఆదేశాలపై ట్రంప్‌ సంతకాలు చేస్తారు. ఆ తర్వాత  కాంగ్రెస్‌లో జరిగే విందులో పాల్గొంటారు. ఆ తర్వాత సాయుధ బలగాలపై సమీక్ష జరుపునున్నారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ట్రంప్‌ ప్రమాణ స్వీకారం రోజున వాషింగ్టన్‌లో ఉష్ణోగ్రత మైనస్‌ 11 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి క్యాపిటల్‌ హిల్‌పై దాడి చేసిన ఆయన మద్దతుదారులు హాజరుకానున్నారు. ఈ మేరకు వారు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News