US Elections: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై పై చేయి సాధించారు. నవంబర్ 5వ తేదీన జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ కంటే ట్రంప్ కే స్వల్పంగా గెలుపు అవకాశాలు ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
US Presidential Election 2024: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే విషయంపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే భారీ ప్రకటన చేస్తానని గత వారం చెప్పిన ట్రంప్.. మంగళవారం అర్ధరాత్రి కీలక ప్రకటన చేశారు.
US Mid Term Election: ప్రస్తుం అందరి కళ్లు అమెరికా మధ్యంతర ఎన్నికలపై నెలకొంది. ఈ ఎన్నికలు జో బైడెన్‌కు అగ్నిపరీక్షగా మారగా.. ట్రంప్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.
అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం తెరపడింది. 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ (Joe Biden) ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది.
America: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన డోనాల్డ్ ట్రంప్ ఇంకా ఓటమిని అంగీకరించడం లేదు. పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే..అక్కడ కూడా చుక్కెదురైంది. ఇకనైనా ఓటమి ఒప్పుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.
ఇటీవలే జరిగిన అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్స్ లో జో బైడెన్ విజయం ( Joe Biden) సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో 46వ అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. అయితే అమెరికా ప్రజలు మాత్రం ఇప్పటి నుంచే సెలబ్రేట్ చేయడం ప్రారంభించారు. ఫోటోలను చూడండి
అత్యంత ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బిడెన్ చివరికి విజయం సాధించారు. అమెరికన్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని జో బిడెన్ స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కెంటకీలోని రాబిట్ హాష్ పట్టణం ఓ కుక్కను మేయర్ గా ఎన్నుకుంది. విల్బర్ బీస్ట్ ఆ కుక్క పేరు..సారీ..ఆ మేయర్ పేరు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పీఠం ఎవరిదనే విషయంలో దాదాపు స్పష్టత వచ్చేసింది. అందుకే విజయం తనొక్కడిదే కాదని..దేశ ప్రజలందరిదీ అని అంటున్నారు జో బిడెన్.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. నువ్వా నేనా రీతిలో కౌంటింగ్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ అంకెల్లో ప్రస్తుతానికి జో బైడెన్...డోనాల్డ్ ట్రంప్ కంటే స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.
అమెరికాలో ఏం జరగబోతోంది.. ప్రీపోల్స్ అన్నీ జో బైడెన్ కే మొగ్గుచూపుతున్నాయి. ప్రీపోల్స్ అంచనాలు నిజమై..బైడెన్ అందలమెక్కుతారా..లేదా గతంలో జరిగినట్టే ప్రీపోల్స్ కాదని ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవిని అధిరోహిస్తారా..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ( Before America Elections ) ముందు అంతర్జాతీయ నోబెల్ శాంతి పురస్కారం ( International peace prize ) ప్రతిపాదన. ఇది డోనాల్డ్ ట్రంప్ కు పాచికలా ఉపయోగపడనుందా. అమెరికాలో ఏం జరుగుతోంది? నార్వే ఎంపీ ట్రంప్ పేరును ప్రతిపాదించడం వెనుక వేరే ఉద్దేశ్యముందా ?
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ) సతీమణి మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా ( Michelle Obama ).. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఘాటు విమర్శలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ సంస్థ ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ తమ సంస్థ ఎల్లవేళలా తటస్థంగా ఉండడానికే ప్రయత్నిస్తుందని చెప్పారు.ట్రంప్ ఫేస్ బుక్ సంస్థను విమర్శిస్తూ, ఈ సోషల్ మీడియా సంస్థ ఎప్పుడూ తనకు వ్యతిరేకమేనని తెలిపారు. ఎల్లో జర్నలిజంతో కూడిన వార్తలు ప్రచురించడం, పక్షపాత వైఖరి చూపించడం ఫేస్ బుక్ నైజమని తెలియజేశారు. సాధారణంగా 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రష్యా పాత్రపై కూడా ఫేస్ బుక్ దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పిందని, సాధారణంగా ఏదైనా నచ్చని వార్తా
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.