Saif Ali Khan: బాలీవుడ్‌లో సంచలనం.. స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితోదాడి, ఆసుపత్రికి తరలింపు..

Attack on Saif Ali Khan: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఓ దుండగుడు సైఫ్‌పై పదునైన ఆయుధంతో దాడి చేసి పారిపోయాడు. దీంతో ఆయనకు గాయలయ్యాయి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ  పూర్తి వివారలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Jan 16, 2025, 09:57 AM IST
Saif Ali Khan: బాలీవుడ్‌లో సంచలనం.. స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితోదాడి, ఆసుపత్రికి తరలింపు..

Attack on Saif Ali Khan: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఆయన ముంబైలోని నివాసంలోకి చొరబడి ఓ దుండుగుడు ఈ దాడికి తెగబడ్డాడు. వివరాలు ప్రకారం అర్ధరాత్రి దుండగుడు ఇంట్లోకి చొరబడ్డాడు పదునైన ఆయుధంతో సైఫ్‌ పై అటాక్‌ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో సైఫ్‌కు గాయం అవ్వడంతో లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కుటుంబ సభ్యులతో పడుకున్న సమయంలో తెల్లవారుజాము 4 గంటలకు ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ అలీ ఖాన్ ను ఆరు చోట్ల తీవ్ర గాయలయ్యాయి.  దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. అప్రమత్తమైన సైఫ్ కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..  వైద్యుల సమాచారం మేరకు సైఫ్ కు ఆరు లోతైన గాయాలయ్యాయి అని తెలుస్తోంది. 

సైఫ్‌ అలీ ఖాన్‌ వెన్నెముకకు లోతైన గాయం అయింది. ఆ దుండగుడు ఇంట్లోకి చొరబడినప్పుడు అప్రమత్తమైన సైఫ్‌ వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ దుండగుడు సైఫ్‌ పై కత్తితో దాడిచేశాడు. దీంతో ఆయనకు ఆరుచోట్ల గాయాలయ్యాయి. సైఫ్‌కు వైద్యులు ప్రస్తుతం సర్జరీ చేస్తున్నారు. 

 

 

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

 

సైఫ్‌ అలీ ఖాన్ దేవర పార్ట్‌ 1 తెలుగు సినిమాలో చివరిగా నటించారు. ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ నటించారు. దేశవ్యాప్తంగా ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల అయింది. ది రెడ్‌ సన్ చాప్టర్‌లో సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ సినిమాకు రాబీ గ్రేవల్‌ డైరక్షన్‌ చేస్తున్నారు. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రముఖ మాజీ క్రికెటర్‌ మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ, షర్మిలా ఠాగూర్‌ల కొడుకు. అమృత సింగ్‌ను మొదటి వివాహం చేసుకున్నారు. కాగా వీరిద్దరూ 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌  కరీనా కపూర్‌ను 2012 లో పెళ్లి చేసుకున్నారు. 

 

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఇంకా సైఫ్ అలీ ఖాన్ మొదటి ఫిల్మ్‌ 'పరంపర'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'ఏ దిల్లగి', ' మే కిలాడి తూ అనారీ, కచ్చేదాగే వంటి సినిమాల్లో నటించాడు. సైఫాలికన్ సినిమా ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంటి సీసీ కెమెరాలు చుట్టుపక్కల బిల్డింగ్లలో ఉన్న సీసీ కెమెరాలు దొంగ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు అని తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ముంబైలోని బాంద్రాలోని సైఫ్‌ అలీ ఖాన్‌ సొంత ఇంటిలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News