Kalpara VFX AI Services: భాగ్య నగరం తెలుగు సినీ పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వీఎఫ్‌ఎక్స్‌కు అధిక ప్రాధాన్యత ఏర్పడిందనే చెప్పారు. సినిమా దర్శకులు అందరు అంతా టెక్నాలజీని యూజ్ చేస్తూ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాజా హైదరాబాద్‌లో కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తమ నూతన బ్రాంచ్‌ను భాగ్యనగరంలో ప్రారంభించారు. దీనికి సంబంధించిన వేడుకల శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్స్ మినిస్టర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, ఒకప్పటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీనువైట్ల , మరో దర్శకుడు కరుణ కుమార్, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన, నటులు విక్రాంత్ రెడ్డి, రఘు కుంచె ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ‘మన తెలుగు బిడ్డ మల్లీశ్వర్ యూఎస్ లో సెటిలై ఎంటర్‌పెన్యూర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో అప్పటి మా ప్రభుత్వం ఆహ్వానించే క్రమంలో సిద్ధిపేటలో ఐటీ కంపెనీ పెట్టి ఎంతోమంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. మన తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్, హాలీవుడ్‌తో పోటీ పడుతుంది. రాబోయే కాలంలో హాలీవుడ్‌తో మరింత పోటీని ఎదుర్కొవాలంటే.. ఇలాంటి వీఎఫ్‌ఎక్స్, ఏఐ టెక్నాలజీ చాలా అవసరమన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ వెంట పరుగెడుతుంది. అమెరికా నుంచి భారత్ కు వచ్చి ఇది స్థాపించిన మల్లీశ్వర్ ఇంకా పైకి ఎదగాలన్నారు. , చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తనవంతు కృషి చేయాలన్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రానికి ఆస్కార్ వచ్చిందంటే అది తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వ కారణమన్నారు. ఇలాంటి టెక్నాలజీని టాలీవుడ్ పరిశ్రమకు రావడం అభినందనీయమన్నారు.
దర్శకులు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. ‘మల్లీశ్వర్ గా మంచి ఆలోచనతో వీఎఫ్‌ఎక్స్‌తో పాటు ఏఐ బ్రాంచ్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ వంతుగా పాలుపంచుకుంటున్నారు. అదే సమయంలో ఇక్కడ యువతకు ఉపాధి అందిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన మాట్లాడుతూ.. కల్పర వీఎఫ్‌ఎక్స్ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. దర్శకులు కరుణ కుమార్ మాట్లాడుతూ ‘తెలుగు సినీ ఇండస్ట్రీలో వీఎఫ్‌ఎక్స్‌కు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. టెక్నికల్‌గా మంచి వారిని గుర్తించడం సమస్యగా మారిన ఈ తరుణంలో మల్లీశ్వర్ ఈ కంపెనీ ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం.
రఘు కుంచె మాట్లాడుతూ.. ‘కల్పర వీఎఫ్‌ఎక్స్ సంస్థ ద్వారా మల్లీశ్వర్ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేయాలన్నారు. హీరో విక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గత దశాబ్ద కాలంలో చిత్ర పరిశ్రమకు వీఎఫ్‌ఎక్స్ అవసరం బాగా పెరిగింది. వీఎఫ్‌ఎక్స్ లేని మూవీ అంటూ ఇపుడు ఏది లేదు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్ సహా ప్రతి సినీ పరిశ్రమకు మేజర్ సర్వీస్ అందిస్తారని కోరుకుంటున్నాన్నారు.
కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ సర్వీసెస్ సీఈవో డాక్టర్ మల్లీశ్వర్ మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. యూఎస్‌లో నాకు ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఏఐ ద్వారా కొన్ని ప్రొడక్ట్స్ డెవలెప్ చేశామన్నారు. . సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ రంగంలోకి ప్రవేశించినట్టు చెప్పుకొచ్చారు. వీఎఫ్‌ఎక్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే చిత్రాలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ఇక్కడ బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. హాలీవుడ్‌లో వాడే టెక్నాలజీని ఇక్కడ కూడా పరిచయం చేస్తున్నామన్నారు. ఈ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందో దర్శకులు రాజమౌళి, నాగ్ అశ్విన్ తెలిసినంత మరెవరికీ తెలియదన్నారు. తక్కువ బడ్జెట్ సినిమాలకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడాలని మేం అనుకుంటున్నాము. టాలీవుడ్‌తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమవంతు పాత్ర పోషిస్తామన్నారు. నా ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసారు.
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.