BRS Party Master Plan: అధికారం మారిన నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టే అంశంపై బీఆర్ఎస్ పార్టీ చర్చించింది. త్వరలోనే మేయర్‌పై అవిశ్వాసానికి గులాబీ పార్టీ సిద్ధమవుతుందనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేల సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే అలాంటి చర్చ జరగలేదని.. అది చిన్న విషయమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు.
Also Read: KT Rama Rao: 'దేశంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచింది ఒకే ఒక్క సీఎం కేసీఆర్'
మాజీ మంత్రి తలసాని ఇంట్లో కేటీఆర్‌తో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలు.. పార్టీ బలోపేతంపై కేటీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో పార్టీ పరిస్థితుల విషయమై కీలక చర్చలు చేసినట్లు వెల్లడించారు.
Also Read: Retirement Age: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. పదవీ విరమణ వయస్సు తగ్గించాలని జేఏసీ ఆందోళన
'ఎమ్మెల్యేలను భోజనానికి పిలిచా. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించాం. రేవంత్ రెడ్డి పాలనపై చర్చించాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలనే విషయంపై చర్చలు చేశాం. పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వం గీత దాటితే మేము కూడా గీత దాటుతాం' అని మాజీ మంత్రి తలసాని ప్రకటించారు. మేయర్ అవిశ్వాసంతో పాటు చాలా విషయాలు చర్చించినట్లు వెల్లడించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్చించలేదు. హైదరాబాద్‌లో వీధి వ్యాపారాలను తొలగిస్తున్నారు. వీధి వ్యాపారుల సమస్యలపై సమావేశంలో చర్చించాం' అని తలసాని వెల్లడించారు.
హైదరాబాద్ మేయర్‌పై అవిశ్వాసం పెద్ద అంశమే కాదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తున్నారనే అంశాన్ని ప్రస్తావించగా అలాంటిదేమీ లేదని తెలిపారు. తాము రాజకీయ నాయకులమని.. మరి రాజకీయాల గురించి తప్పక చర్చించినట్లు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter