Ys Jagan: ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ ఇప్పుడు చర్చనీయాంశంంగా మారింది. పార్టీ కార్యకర్తల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. జగన్‌లో మార్పు వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకూ ఓ రకంగా చూశామని, ఇక నుంచి మరోలా ఉంటుందని చెప్పారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడటమే కాకుండా అన్యాయం చేసినవారికి చట్టపరంగా శిక్షిస్తామన్నారు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులు మరెప్పుడూ లేవన్నారు. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 8 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత సంపాదించుకుందని వైఎస్ జగన్ విమర్శించారు. మేనిఫెస్టో హామీలను 8 నెలల్లో పూర్తిగా గాలికొదిలేశారన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేశారన్నారు. ఇలా జరుగుతుందని, చంద్రబాబు మోసపు నైజం గురించి ముందే చెప్పామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోందని చెప్పారు. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి 3900 కోట్లు పెండింగులో పెట్టారన్నారు. ఇంటింటికీ డోర్ డెలివరీ కాదు కదా..ఆ పధకాల కోసం టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అతనికి పాలన అప్పగించడమంటే పులి నోట్లో తలకాయ పెట్టడమేనన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లా పర్యాటనలకు వస్తాన్నారు.
Also read: SBI Millionaire Scheme: రోజుకు 80 రూపాయలు జమ చేస్తే చాలు లక్షాధికారి కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.