Telangana Government: మూసీ నిర్వాసితులకు మరో బంపర్‌ ఆఫర్.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లతోపాటు..

Telangana Government Bumper offer: మూసీ బఫర్ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ఇళ్లను కూల్చివేతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అక్కడి వారిని దగ్గరలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు కూడా తరలిస్తోంది. అయితే స్వచ్చందంగా వెళ్లినందుకు బాధిత కుటుంబాలకు ప్రోత్సాహకంగా రూ.25,000 కూడా అందించనున్నట్లు సమాచారం.

Written by - Renuka Godugu | Last Updated : Oct 3, 2024, 11:32 AM IST
Telangana Government: మూసీ నిర్వాసితులకు మరో బంపర్‌ ఆఫర్.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లతోపాటు..

Telangana Government Bumper offer: భాగంగా అక్కడ ఉంటున్న నివాసితులను ఖాళీ చేయించి తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై అభ్యంతరాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లతోపాటు రూ.25000 అందించనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక మూసీ నది ప్రక్షాళన వల్ల ఎన్నో కుటుంబాలు మెరుగుపడతాయి. మరో రెండేళ్లలో మూసీ నదిలో కేవలం మంచినీరు మాత్రమే ప్రవహించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.

 ఈ నేపథ్యంలో మూసీ బఫర్ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ఇళ్లను కూల్చివేతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అక్కడి వారిని దగ్గరలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు కూడా తరలిస్తోంది. అయితే స్వచ్చందంగా వెళ్లినందుకు బాధిత కుటుంబాలకు ప్రోత్సాహకంగా రూ.25,000 కూడా అందించనున్నట్లు సమాచారం.ఇప్పటికే ప్రభుత్వం మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం అని చెప్పిన సంగతి తెలిసిందే. పిల్లలు పాఠశాలలను నష్టపోకుండా సమీపంలోని విద్యాసంస్థల్లో సీట్లను కూడా ఇవ్వనుంది. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లతోపాటు రూ.25,000 కూడా అందించనుందట.

 ఇల్లు ఖాళీ చేస్తున్న సమయంలోనే ఈ డబ్బులు వారి చేతికి ఇవ్వనున్నారు. అక్కడి నుంచి చాలామంది ఇప్పటికే ఖాళీ చేశారు కేవలం 20 శాతం మంది అక్కడి నుంచి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. వారిని ఒప్పించడానికి ప్రభుత్వ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.మూసీ నది శుద్ధి కోసమే రూ.3,800 కోట్లు ఖర్చు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ అభివృద్ధి పనులను సింగపూర్‌ సంస్థను ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తోంది.

ఇదీ చదవండి: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!  

మూసీ నిర్వాసితులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇందులో భాగంగానే రూ.25,000 ఇల్లు పారితోషికం హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దూరిశెట్టి తెలిపారు. వారు స్వచ్చంతంగా వెళ్తున్నందుకు వెసులుబాటుగా ఈ డబ్బును అందిస్తున్నట్లు  ఓ పత్రిక ప్రకటన విడుదలైంది. 

ఇదీ చదవండి: కావ్యను అడ్డంగా ఇరికించిన అనామిక.. కంగ్రాచ్యూలేట్ చేసి వెళ్లిపోయిన రాజ్ మీడియా ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి..

అంతేకాదు మూసీ కాలుష్యం వల్ల నల్గొండలో కూడా బారిన పడుతున్నట్లు మంత్రి కొమటిరెడ్డి నిన్న మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. నల్గొండలో ఫ్లోరైడ్‌ బారిన పడుతున్నారు. దీనికి ఎంత ఖర్చు పెట్టిన ఫర్వాలేదు. మూసీ నది ప్రక్షాళన జరగాలని అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి జరగలేదు. వర్షాలు పడినా ముందుగా వ్యాధుల బారిన పడేది అక్కడివారే. వారికి సరైన విద్య కూడా లేదు. ఈ ప్రకటనతో కొంతమంది అక్కడి నుంచి తరలివెళ్లే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వారికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లతోపాటు రూ.25,000 అందుతుంది. అంతేకాదు ఎప్పటికైనా మూసీ ప్రక్షాళన అనేది కచ్చితం కాబట్టి ఎఫ్‌టీఎల్‌ , బఫర్ జోన్లలో ఇళ్లు కూడా తొలగిపోతాయి. ప్రభుత్వం కూడా మూసీ అభివృద్ధికి ఎంతైనా ఖర్చు పెడతామని చెప్పిన సంగతి తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News