Reuse Green Tea Bags: ఈ విషయం తెలిశాక మీరు కూడా వాడేసిన టీ బ్యాగులను ఇక పొరపాటున కూడా వేస్ట్‌గా పడేయ్యరు. మన వంటి గది కిచెన్‌లో గ్రీన్ టీ బ్యాగులు కచ్చితంగా ఉంటాయి. చాలామంది వాటిని వినియోగించగానే పాడేస్తారు. ఇందులో ఎన్నో ఖనిజాలు కూడా ఉంటాయి. ఈ వాడేసిన గ్రీన్ టీ బ్యాగులతో 5 విధాలుగా తిరిగి ఉపయోగించవచ్చని మీకు తెలుసా?
ప్లాంట్ పవర్‌హౌజ్..
మన మొక్కలకు కేవలం నీరు, మాన్యూర్ మాత్రమే సరిపోదు. దీనికి గ్రీన్ టీ బ్యాగులు కూడ ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాడేసిన గ్రీన్ టీ బ్యాగ్‌ను చెట్టు మొదట్లో వేయడం వల్ల మట్టికి మరింత బలం చేకూరుతుంది. గ్రీన్ టీ బ్యాగ్‌ను కట్ చేసి ఆ టీ ని చెట్టు మొదట్లో మట్టిలో వేయాలి. ఇందులోని ఖనిజాలు మట్టికి బలాన్ని పెంచుతాయి. ఈ ఆకులు మట్టిని మాయిశ్చర్‌గా ఉంచడానికి పనిచేస్తాయి. నైట్రోజెన్ కూడా అందిస్తాయి.
షూ దుర్గంధం..
మీ షూల నుంచి దుర్గంధం వస్తుంటే ఈ వాడేసిన టీ బ్యాగులు ఎఫెక్టీవ్‌గా పనిచేస్తాయి. గ్రీన్ టీ దుర్గంధాన్ని దూరం చేస్తాయి. గ్రీన్ టీ బ్యాగ్‌లోని టీ కాస్త ఆరనివ్వాలి. ఆ తర్వాత దీన్ని షూ లో కాసేపు వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల గ్రీన్ టీ బ్యాగులు వెంటనే దుర్గంధాన్ని గ్రహించేస్తాయి. ఇలా ఫ్రిజ్ నుంచి దుర్గంధం వచ్చినా గ్రీన్‌టీ బ్యాగ్‌ను ఓపెన్ చేసి ఫ్రిజ్ మూలలో పెట్టడం వల్ల దుర్గంధాన్ని గ్రహిస్తుంది.
స్కిన్ కేర్..
గ్రీన్ టీ బ్యాగులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. గ్రీన్ టీ బ్యాగ్‌ను కంటిపై పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. కంటి చుట్టూ వాపు ఉన్నవారు కూడా గ్రీన్ టీ బ్యాగ్ ను ఉపయోగించాలి. ముఖ్యంగా ఇందులో నయం చేసే గుణాలు ఉంటాయి. ఈ గ్రీన్ టీ బ్యాగ్‌తో మంచి టోనర్ కూడా తయారు చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: ఈ మాస్క్ వేస్తే పెచ్చులు పెచ్చులుగా ఉన్న చుండ్రు కూడా రాలిపోవాల్సిందే..
నేచురల్ క్లెన్సర్..
గ్రీన్ టీ బ్యాగుల్లో మంచి క్లెన్సింగ్ గుణాలు కూడా కలిగి ఉంటుంది. వాడేసిన గ్రీన్ టీ బ్యాగు మన ముఖానికి మంచి క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. మీ ముఖం సహజసిద్ధంగా మెరిసిపోతుంది. దీనికి 7 గ్రీన్ టీ బ్యాగులను తీసుకొని వేడి నీళ్లలో నానబెట్టాలి. అందులోని ఫ్లేవర్స్ నీటిలోకి విడుదల అవుతాయి. ఈ నీరు చల్లారిన తర్వాత ముఖానికి క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. గ్రీన్ టీ బ్యాగులతో ఫర్నిచర్, గ్లాస్, అద్దాలను కూడా క్లీన్ చేయవచ్చు. గ్రీన్ టీ లో ఉండే టానిన్స్ మరకలను త్వరగా తొలగిస్తుంది. ఇది ఇంటి వస్తువులకు మంచి షైన్ కూడా అందిస్తుంది.
ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో పొరపాటున కూడా ఈ 6 ఆహారాలు తినకూడదు..
చర్మం దురద..
సన్‌బర్న్ సమస్యలకు కూడా గ్రీన్ టీ ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. గ్రీన్ టీ బ్యాగులు చర్మ దురదల నుంచి త్వరగా విముక్తి కలిగిస్తుంది. గ్రీన్ టీ బ్యాగులు వాడేసిన తర్వాత ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. దురదలు ఉన్న ప్రదేశంలో గ్రీన్ టీ బ్యాగుతో సున్నితంగా ప్రెస్ చేస్తూ ఉండాలి. దీనివల్ల చర్మం దురదల వల్ల ఏర్పడే ఎరుపుదనం కూడా తగ్గిపోతుంది. చర్మవాపు, దురదలకు గ్రీన్ టీ బ్యాగు ఎఫెక్టీవ్ రెమిడీ.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter
Green Tea Bags: వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను తిరిగి 5 విధాలుగా ఉపయోగించవచ్చు తెలుసా?