AP Excise Policy: గతంలో అస్తవ్యస్త మద్యం విధానం అమల్లో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ మందుబాబులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మరి మద్యం సేవించేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో మద్యం విధానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే కొత్త మద్యం విధానం తీసుకురానున్నారు. ఆ మద్యం విధానం ద్వారా అతి తక్కువ ధరకే మద్యం అందుబాటులోకి రానుందని సమాచారం. బిర్యానీ కన్నా తక్కువ ధరకే మధ్యం లభిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో క్వార్టర్ సీసా కేవలం రూ.80 నుంచి 90 లోపే ధర నిర్ణయించాలని ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఇకపై ఏపీ మందుబాబులు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.
Also Read: AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో పదవుల పండుగ.. ఆశల పల్లకీలో నాయకులు
శాసనసభ ఎన్నికల సమయంలోనే టీడీపీ అధినేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం ధరలు తగ్గిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రాండెడ్ మద్యం కూడా ఏపీలో విక్రయిస్తామని ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం బ్రాండెడ్ మద్యం విక్రయించడంతోపాటు మద్యం ధరలు భారీగా తగ్గించాలనే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖపై పలుమార్లు సమీక్ష చేసిన కూటమి ప్రభుత్వం త్వరలో కొత్త విధానం తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మద్యం విధానంపై పలు కంపెనీలతో ఎక్సైజ్ శాఖ చర్చలు చేసింది. అందరి అభిప్రాయాలు, సూచనలను తీసుకున్న ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక విధానం రూపొందించిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Independence Day: ఆగస్టు 15న జెండా ఎగురవేసే మంత్రుల జాబితా ఇదే! మరి పవన్ కల్యాణ్ ఎక్కడ?
ఆ కొత్త మద్యం విధానంలో అన్ని రకాల ఎన్‌ఎంసీ బ్రాండ్లకు అనుమతించనున్నట్లు సమాచారం. గతంలో తక్కువ ధర కేటగిరీలో క్వార్టర్ సీసా రూ.200కు విక్రయించారు. ఇప్పుడు దాని ధరను కేవలం రూ.80 నుంచి 90 లోపే నిర్ధారించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. మిగతా మద్యం ధరలు కూడా తగ్గించి నామమాత్రపు ధరలకే మద్యం అందుబాటులో ఉంచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం లభించక రాష్ట్ర యువత గంజాయి బారినపడుతున్న విషయాన్ని గుర్తించి వారందరినీ మద్యం వైపు మళ్లే యోచన చేస్తోంది. అందులో భాగంగా మద్యం ధరలు తగ్గించడం. అయితే ఇప్పటికే రూపకల్పన చేసిన కొత్త మద్యం విధానాన్ని ఈ నెలాఖరులో కానీ వినాయక చవితిలోపు కానీ అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి