CM Jagan: ఏపీలో అర్చకులకు శుభవార్త.. సీఎం జగన్ దసరా గిఫ్ట్

Minimum Wage For Temple Priests: ఏపీ అర్చకులకు కనీస వేతనాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15,625 రూపాయలు కనీస వేతనం అమలుకు సంబంధించి దేవాదాయ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2023, 06:56 AM IST
CM Jagan: ఏపీలో అర్చకులకు శుభవార్త.. సీఎం జగన్ దసరా గిఫ్ట్

Minimum Wage For Temple Priests: దసరా పండుగ సందర్భంగా అర్చకులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. అర్చకులకు ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేరుస్తూ.. కనీస వేతనం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలో ఉన్న 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625 అమలు కానుంది. ఈ మేరకు దేవాదాయ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2021 మే నెలలో జారీ చేసిన జీవోకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమకు కనీస వేతనాలు అమలు చేయడంపై అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఇక రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ సంక్షేమ ఛైర్మన్‌గా పేరి కామేశ్వరరావు నియమితులయ్యారు. ఆయన కోనసీమ జిల్లా అంబాజీపేట వాసి. కామేశ్వరరావు నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణ కార్పొరేషన్‌తో పాటు రాష్ట్రంలోని బ్రాహ్మణుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతోపాటు పసుపు, కుంకుమలను అందించనున్నారు ముఖ్యమంత్రి. మరోవైపు ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. శుక్రవారం, కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రమైన మూల కలిసి రావడంతో నేడు భక్తులు భారీ ఎత్తున తరలిరానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. సరస్వతీదేవి రూపంలో అమ్మవారు భక్తులను దర్శనమివ్వనున్నారు.

Also Read: IND vs BAN Highlights: కోహ్లీ మెరుపు సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం..

Also Read:  Lava Blaze Pro 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News