/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Best Foods And Drinks For Weight Loss: అధిక బరువు తగ్గాలని ప్రయత్నించే వారు అందు కోసం ఎన్నో వ్యాయమాలు చేస్తుంటారు. ఎన్నో కుస్తీలు పడుతుంటారు. అధిక బరువు తగ్గించుకోవడం కోసం, పొట్టలో కొవ్వు కరిగించుకోవడం కోసం శారీరకంగా ఎంతో కష్టపడుతుంటారు కానీ తీసుకోవాల్సిన ఆహారం విషయంలో తమకు మాత్రం తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేసి తాము పడిన శ్రమ అంతా వృధా అయ్యేలా చేసుకుంటారు. అంతేకాకుండా ఎంత కష్టపడినా బరువు తగ్గడం లేదు కదా అని మానసికంగా ఆందోళనకు గురై కొత్తగా మరో అనారోగ్య సమస్యను కొని తెచ్చుకుంటుంటారు. అలా జరగకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అందులోనూ ఖాళీ కడుపుతో తినే వాటిలో, తాగే వాటిలో ఇంకొంత జాగ్రత్త అవసరం. ఇంతకీ ఖాళీ కడుపుతో ఏమేం తింటే సరైన ఫలితాలు కనిపిస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మరసం కలిపిన వేడి నీళ్లు : 
పొద్దు పొద్దున్నే ఖాళీ కడుపుతో ఉండగానే నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లు తాగడం వల్ల శరీరంలో మెటాబాలిజం మెరుగుపడుతుంది. తీసుకునే ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా నిమ్మరసంలో ఉండే విటమిన్ C వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 

కొవ్వుని కరిగించే గ్రీన్ టీ : 
గ్రీన్ టీకి అధిక కొవ్వుని కరిగించే గుణం ఉంటుంది. అంతేకాకుండా అధిక కేలరీలను కరిగించే శక్తి సామర్ధ్యాలు కూడా గ్రీన్ టీ సొంతం. అందుకే పరిగడుపునే గ్రీన్ టీ తాగితే అది మీ శరీరంలో మెటాబాలిజం మెరుగుపడేలా చేసి అధిక బరువుని తగ్గిస్తుంది.

సబ్జా గింజలు / చియా సీడ్స్ : 
అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చియా సీడ్స్‌నే మనం తెలుగులో సబ్జా గింజలు అని అంటుంటాం. నీళ్లలో కానీ లేదా యుగర్ట్ లో కానీ నానబెట్టిన సబ్జా గింజలు తినడం వల్ల వీటిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్, రిచ్ ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉన్న భావన కల్పిస్తాయి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మోతాదుకి మించి తినే అలవాటుకి దూరం చేసి బరువు తగ్గించేందుకు సబ్జా గింజలు సహాయపడతాయన్నమాట.

ఓట్స్ మీల్ :
ఓట్స్ తో ఆహరం తినడం వల్ల అందులో ఎక్కువ మోతాదులో ఉండే ఫైబర్ అధిక ఆకలిని నివారిస్తుంది. అంతేకాకుండా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపించేలా చేసి మీరు ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా చేస్తుంది. బ్లడ్ షుగర్ లెెవెల్స్ ని సైతం అదుపులో ఉంచుతుంది. 

బెర్రీ పండ్లు : 
బెర్రి పండ్లలో ఫైబర్, యాంటీ - ఆక్సీడెంట్స్ ఎక్కువగా ఉండి కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ శక్తిని పెంచడంతో పాటు అదే సమయంలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల అధిక బరువు పెరగకుండా నివారిస్తుంది. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్ పండ్లు హెల్తీ బ్రేక్ ఫాస్ట్‌కి మంచి ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. 

ఇది కూడా చదవండి : Weight loss Drink: కొబ్బరి నీళ్లలో ఈ గింజలు కలిపి చూడండి, అద్బుతమే ఇక

బాదాం :
బాదాంలో ఫైబర్, ప్రోటీన్స్ అధిక మోతాదులో ఉంటాయి. అందుకే ఖాళీ కడుపుతో గుప్పెడన్ని బాదాం పలుకులు తింటే అవి మీకు అనవసర ఆకలిని తగ్గించడమే కాకుండా ఎక్కువసేపు ఒంటికి శక్తినిస్తాయి.

ఇది కూడా చదవండి : Nipah Virus 2023: నిపా వైరస్ రావడానికి కారణాలు, నివారణ చర్యలు, హోం రెమెడీస్‌..

(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించడానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
foods to eat on empty stomach in the mornings for weight loss green tea to chia seeds
News Source: 
Home Title: 

Foods For Weight Loss: ఖాళీ కడుపుతో ఇవి తింటే అధిక బరువు ఇట్టే తగ్గుతారు

Foods For Weight Loss: ఖాళీ కడుపుతో ఇవి తింటే అధిక బరువు ఇట్టే తగ్గుతారు
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Foods For Weight Loss: ఖాళీ కడుపుతో ఇవి తింటే అధిక బరువు ఇట్టే తగ్గుతారు
Pavan
Publish Later: 
No
Publish At: 
Wednesday, September 13, 2023 - 22:15
Request Count: 
62
Is Breaking News: 
No
Word Count: 
395