High Cholesterol: ఉల్లిపాయలతో కూడా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు! ప్రతి రోజు ఇలా చేయండి..

Onion For High Cholesterol: ఉల్లిపాయను ప్రతి రోజు ఆహారంలో తీసుకుంటే శరీరంలోని కొలెస్ట్రాల్‌ పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా చెడు కొవ్వు కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2023, 04:39 PM IST
High Cholesterol: ఉల్లిపాయలతో కూడా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు! ప్రతి రోజు ఇలా చేయండి..

 

Onion For High Cholesterol:  ప్రస్తుతం అధిక కొలెస్ట్రాల్ కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే చిన్న, పెద్ద తేడా లేకుంగా అందరూ చెడు కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మందిలో ఈ సమస్య కారణంగా గుండెపోటుతో  సహా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం చాలా మందిలో కొలెస్ట్రాల్ క్రమంగా గుండెలోని సిరల్లో పేరుకుపోతోంది. దీని కారణంగా రక్త నాళాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అయితే ఇలాంటి సమస్యలే తరచుగా జరిగితే గుండెకు ఆక్సిజన్ అందడం తగ్గిపోతుంది. దీని కారణంగా మొదట అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆపై గుండెపోటుతో పాటు చాలా మందిలో ఇతర ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. 

ఉల్లిపాయలు తినడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చా?:
ప్రతి రోజు ఉల్లిపాయలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల సిరల్లో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఉల్లిలో ఉండే గుణాలు హెచ్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ను పెంచి ఎల్‌డిఎల్‌ని తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఉల్లిపాయలను తినడానికి ఇష్టపడని వారు ప్రతి రోజు వీటిని సలాడ్స్‌లో మిక్స్‌ చేసుకుని తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల సులభంగా శరీర బరువును కూడా నియంత్రించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
ఉల్లి ఈ వ్యాధులకు చెక్‌ పెడుతుంది:
ఉల్లిపాయను వైద్యులు సూపర్‌ఫుడ్‌ భావిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ప్రతి రోజు వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారికి తరచుగా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కూడా ప్రతి రోజు ఉల్లిని ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. 

(నోట్‌ : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News