Happy Makara Sankranti GIF Stickers Download: సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ఊరూ వాడా అంత సిద్ధమైంది. ఈరోజు 13వ తేదీ భోగి పండుగ. రేపు జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగ. ఈ పండుగను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించుకుంటారు. దేశంలో ఏ మూలన ఉన్న సంక్రాంతి పండుగకు మాత్రం ఊరికి పోవాల్సిందే. పండుగ జరుపుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల కిందట నుంచి పట్నం అంతా ఖాళీ అయింది. అందరూ పల్లె బాట పట్టారు. హైదరాబాద్ పూర్తిగా ఖాళీ అయిపోయిందా? అన్నట్లుగా రోడ్లు కనిపిస్తున్నాయి.
అందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవాని కోరకుంటారు. అందుకే పల్లెబాట పడతారు. అయితే, సంక్రాంతి పండుగ మూడు రోజులపాటు నిర్వహిస్తారు. అందులో భోగి, సంక్రాంతి, కనుమ పండుగ మూడు రోజులు ఘనంగా జరుపుకొంటారు. అయితే, జనవరి 14 సంక్రాంతి పండుగ సందర్భగా మీ బంధువులు, స్నేహితులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. వాట్సాప్ ఆధారంగా ఈ విషెస్ పంపవచ్చు. దీనికి ముందుగా GIF స్టిక్కర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. GIF వాట్సాప్‌లో కొన్ని అందుబాటులో ఉంటాయి. మరికొన్ని థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు సంక్రాంతి GIF స్టిక్కర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి తెలుసుకుందాం..
వాట్సాప్ GIF స్టిక్కర్స్..
వాట్సాప్ ద్వారా GIF సంక్రాంతి తెలుగు శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. దీనికి ముందుగా మీరు పంపాల్సిన కాంటాక్ట్ చాట్‌లోకి వెళ్లాలి. అక్కడ టెక్ట్స్ బాక్స్‌పై ఉన్న ఎమోజీ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత స్టిక్కర్ ఐకాన్ ఎంపిక చేసుకోవాలి. '+' బట్టన్ క్లిక్ చేయాలి. అక్కడ మీకు 'మకర సంక్రాంతి' లేదా 'సంక్రాంతి' స్టిక్కర్స్ కనిపిస్తాయి. మీకు నచ్చిన స్టిక్కర్లను పంపించుకోండి.
థర్డ్ పార్టీ యాప్స్..
థర్డ్‌పార్టీ యాప్ ద్వారా పంపాలంటే ప్లేసటోర్ నుంచి మీకు నచ్చిన సంక్రాంతి స్టిక్కర్ డౌన్లోడ్ చేసుకోవాలి. వాటిని వాట్సాప్‌కు యాడ్ చేయాలి. దీంతో అవి ఆటోమెటిగ్గా వాట్సాప్‌లోకి డౌన్లోడ్ అయిపోతాయి. అక్కడి నుంచి మీరు కావాల్సిన చాట్‌కు 'సంక్రాంతి' శుభాకాంక్షలు తెలియజేయండి.
ఇదీ చదవండి: ఈ ఫేస్ మాస్క్ వేసుకుంటే.. చలికాలంలో కూడా మీ ముఖం చంద్రబింబంలా మెరిసిపోతుంది..
కస్టమ్ స్టిక్కర్..
మీరు స్టిక్కర్‌ను కస్టమైజ్ చేసి కూడా పంపిచవచ్చు దీనికి స్టిక్కర్ మేకర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండూ వెర్షన్లకు అందుబాటులో ఉంది. ఏదైనా ఫోటో లేదా ఆర్ట్ మాదిరి కస్టమైజ్ చేసి వాట్సాప్ ద్వారా విషెస్ పంపొచ్చు.
ఇవి కాకుండా గూగుల్ నుంచి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు స్టిక్కర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫోటోలు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాట్సాప్‌కు యాడ్ చేసుకోవాలి. లేదా వేరే ఇతర ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా షేర్ చేయవచ్చు. ఇలా మీకు కావాల్సిన విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ బంధువులు, స్నేహితులకు పంపించండి.
ఇదీ చదవండి: ఉద్యోగులకు సంక్రాంతి బంపర్ ఆఫర్.. బ్యాంకులకు 2 రోజులు సెలవులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.