Congress Party: మంత్రులకు హైకమాండ్‌ క్లాస్‌.. కేబినెట్‌ నుంచి ఇద్దరు ఔట్‌?

Revanth Reddy: టీ కాంగ్రెస్ లీడర్లపై పార్టీ హైకమాండ్ సీరియస్‌ అయ్యిందా..! గాంధీ భవన్‌ వేదికగా AICC జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ నేతలకు క్లాస్‌ తీసుకున్నారా..! పార్టీలో కొందరు నేతలు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని వార్నింగ్ ఇచ్చారా..! ఇకమీదట లైన్ దాటి వ్యవహరిస్తే చర్యలు తప్పవని లీడర్లను హెచ్చరించారా..! రేవంత్ రెడ్డి కేబినెట్‌ మంత్రికి కేసీ వేణుగోపాల్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా..! కేసీ ఆగ్రహానికి గురైన ఆ నేత ఎవరు..!

Written by - G Shekhar | Last Updated : Jan 14, 2025, 04:00 PM IST
Congress Party: మంత్రులకు హైకమాండ్‌ క్లాస్‌.. కేబినెట్‌ నుంచి ఇద్దరు ఔట్‌?

Mahesh Kumar Goud: తెలంగాణలో పొలిటికల్‌ ఎఫైర్స్ కమిటీ సమావేశం హాట్‌హాట్‌గా సాగినట్టు తెలుస్తోంది. గాంధీభవన్ వేదికగా పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌ దీపాదాస్‌ మున్షీ అధ్యక్షతన జరిగినా సమావేశానికి AICC కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లతో పాటు 23 మంది పీఏసీ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో టీ కాంగ్రెస్ నేతలకు కేసీ వేణుగోపాల్ క్లాస్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే.. మిగతా మంత్రులు ఏం చేస్తున్నారని గట్టిగా నిలదీసినట్టు సమాచారం. అటు బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే గట్టిగా కౌంటర్ ఇస్తుంటే మీరేందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని, తనను విమర్శించిన ప్రతిసారి బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలకు ఆయన ఒక్కరే సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని కేటీఆర్‌, హరీశ్‌ రావు, బీజేపీ నేతలు కిషన్‌ రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి నేరుగా విమర్శలు గుప్పించినా మంత్రులు కనీసం కౌంటర్ కూడా ఇవ్వడం లేదు.. ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినా ప్రతిసారి సీఎం రేవంత్‌ రెడ్డే గట్టిగా కౌంటర్‌ ఇస్తున్నారు. అయితే గతంలో చాలా మంది లీడర్లు తాము సీఎం అభ్యర్దులమే అని ప్రకటించుకున్న వారు ప్రతిపక్షాన్ని ఎందుకు తిట్టలేకపోతున్నారనే చర్చ పార్టీలో జరిగిందని సమాచారం. ఇందులో ఏదైనా లోపాయికారీ ఒప్పందం ఉందా అనే అనుమానాలు సైతం రేకెత్తాయట. అందుకే బీఆర్‌ఎస్‌ నేతలను కాంగ్రెస్ మంత్రులు తిట్టలేకపోతున్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోందట. అయితే ఇదే విషయాన్ని కొందరు నేతలు పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.

మరోవైపు ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డికి అండగా నిలిచినట్టు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలను మంత్రులంతా నిలదీయాలని చెప్పినట్టు సమాచారం. అయితే కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతుండగా.. ఓ మంత్రి కల్పించుకున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డిని ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు తాను స్పందిస్తున్నానని చెప్పబోయారట. దాంతో కల్పించుకున్న కేసీ వేణుగోపాల్‌ ఎవరేం చేస్తున్నారో తనకంతా తెలుసని అన్నారట. అలాగే కొందరు మంత్రులు పార్టీ లైన్ దాటి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు ఈ సమావేశానికి ముందు పీఆర్‌ఓలను కేసీ వేణు గోపాల్ బయటకు పంపడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సమావేశంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ  సభ్యులు మాత్రమే ఉండాలని వేణు గోపాల్ హుకుం కూడా జారీ చేశారట. అలాగే డోర్ బయట కూడా ఎవ్వరూ ఉండొద్దు అని ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాశంగా మారింది.

మరోవైపు ప్రభుత్వంలో మంత్రులు పనితీరును మెరుగు పరుచుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందరూ మంత్రుల పనితీరుకు సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉందని చెప్పారట. మంత్రుల పనితీరు పట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల పనితీరు పట్ల పార్టీ కార్యకర్తలూ సంతోషంగా లేరని గుర్తు చేశారట. దీనిని సరిదిద్దుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అలాగే గాంధీభవన్‌లో వారానికోసారి నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమాన్ని జిల్లాల్లోనూ నెలకోసారి నిర్వహించాలని ఆదేశించారట. మొత్తంగా కేసీ వేణుగోపాల్‌ రాక తెలంగాణ కాంగ్రెస్‌ లీడర్లలో కాక పుట్టించిందనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి కేసీ వార్నింగ్‌తోనైనా నేతలు దారికొస్తారా... లేక తామదారి తమదే అన్నట్టుగా వ్యవహరిస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు ఆగాల్సిందే..!

Also Read: Liquor Price Dwon: ఏపీ ప్రజలకు 'సంక్రాంతి కిక్కు'.. భారీగా మద్యం ధరలు తగ్గుముఖం

Also Read: Sankranthiki Vasthunnam review: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ.. వెంకటేష్, అనిల్ రావిపూడి మ్యాజిక్ రిపీట్ అయిందా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News