Happy Makar Sankranti 2025 Wishes In Telugu: 2025 సంవత్సరంలోని సంక్రాంతి వేడుకలు ఒకరోజు ముందే భోగి పండుగ నుంచి ప్రారంభమయ్యాయి. చిన్న పెద్ద తేడా లేకుండా సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా పిండి వంటలను ఆస్వాదిస్తూ రోజంతా సంతోషంగా ఉంటారు. ఇలా సంక్రాంతికి ఉన్న ప్రత్యేకతే వేరు.. ఈ ఏడాది సంక్రాంతి పండగ జనవరి 14వ తేదీన వచ్చింది. రైతుల ఇండ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపే పండగ రోజున ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సుఖ సంతోషాలతో ప్రతి ఏడు సంక్రాంతి పండగను ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. అందరికీ ఇలా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలపండి.
ప్రతి సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండగ ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండగ ప్రత్యేకమైన శుభాకాంక్షలు.
సంక్రాంతి పండగ ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహాన్ని.. ప్రశాంతమైన జీవితాన్ని అందించాలని మనసారా కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి..
నువ్వులు బెల్లంతో చేసిన ముద్దలు తిని.. తియ్యగా మాట్లాడుకుందాం.. సంక్రాంతి పూట మనమంతా కలిసి చేసుకుందాం.. గత సంవత్సరం చేసిన ప్రతీది మర్చిపోయి.. ఈ తీపి మాటల ద్వారా బంధాన్ని మరింత రెట్టింపు చేసుకుందాం.. సంక్రాంతి ప్రత్యేకమైన శుభాకాంక్షలు..
సంక్రాంతి సందర్భంగా మీ జీవితంలో చేదు జ్ఞాపకాలన్నీ తొలగిపోవాలని..తీపి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నిలిచిపోవాలని.. మీ కొత్త కలలు సహకారం అవ్వాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ.. సంక్రాంతి పండగ శుభాకాంక్షలు..
ఈ సంక్రాంతి పండగ మీ జీవితాల్లో కొత్త వెలుగును నింపాలని.. జీవితం కొత్త ఆరంభాలతో ప్రారంభం కావాలని కోరుకుంటూ.. హ్యాపీ సంక్రాంతి..
ఈ మకర సంక్రమణం వేళ.. మీ జీవితాల్లో కొత్త ఆరంభాలు ప్రారంభం కావాలని మనసారా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
మకర సంక్రాంతి రోజున ప్రకాశించే సూర్యుడు మీ జీవితంలో సంతోషాలతో పాటు సిరి సంపదలను తీసుకురావాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
సంక్రాంతి వెలుగులు మీ జీవితంలో చేదు సంఘటనలు అన్నింటిని కాల్చివేయాలని.. అద్భుతమైన ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ.. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..
ఈ మకర సంక్రాంతి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందకరమైన క్షణాలను అందించాలని.. ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి వాకిట్లో ముగ్గుల సందడిని, సంబురాలను తీసుకురావాలని.. జీవితంలో కొత్త వెలుగును నింపాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.