Mazaka Movie controversy: మా ఇంట్లోను ఆడవాళ్లున్నారు.. దయచేసి క్షమించండి.. వీడియో రిలీజ్ చేసిన త్రినాథరావు..

Nakkina Trinadha rao: మజాకా మూవీ టీజర్ రిలీజ్ వేళ ఏదో అనుకొకుండా నోరుజారీ మాట్లాడానని డైరెక్టర్ త్రినాథ రావు క్లారిటీ ఇచ్చారు. ఈనేపథ్యంలో దీనిపై వీడియోను రిలీజ్ చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 13, 2025, 04:18 PM IST
  • యూటర్న్ తీసుకున్న డైరెక్టర్..
  • మహిళందరికి సారీ అంటూ వీడియో విడుదల..
Mazaka Movie controversy: మా ఇంట్లోను ఆడవాళ్లున్నారు.. దయచేసి క్షమించండి.. వీడియో రిలీజ్ చేసిన త్రినాథరావు..

Director trinadha rao apology video viral: మజాకా మూవీ టీజర్ రిలీజ్ వేడుక నిన్న జరిగింది. ఈక్రమంలో డైరెక్టర్ త్రినాథ రావు.. వేదికపైన నుంచి మన్మథుడు ఫెమ్ అన్షును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. హీరోయిన్లు సైజ్ లు పెంచుకొవాలని కూడా ఆయన పచ్చి బూతులు మాట్లాడారు. గతంలో మన్మథుడు సినిమాను చూసేందుకు.. ఈ హీరోయిన్ కారణమని.. అప్పట్లొ కత్తిలా ఉండేదంటూ కూడా కామెంట్లు చేశారు. 

 

దీంతో నటి అన్షు తోపాటు, రీతు వర్మ కూడా చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. ఇది చాలదన్నట్లు.. అల్లు అర్జున్ సీన్ ను కూడా ఇన్ డైరెక్ట్ గా ఇమిటేట్ చేశారు. బన్నీ అప్పట్లో సీఎం రేవంత్ మర్చిపోయినట్లు.. డైరెక్టర్ రీతు వర్మ పేరును మర్చిపోయినట్లు ఇమిటేట్ చేశారు. ఇవన్ని నిన్నటి నుంచి తెగ వివాస్పదంగా మారాయి. నెటిజన్లు డైరెక్టర్ త్రినాథ రావును ఏకీపారేశారు. అదే విధంగా తెలంగాణ మహిళ కమిషన్ దీన్ని సుమోటోగా స్వీకరించింది.  

డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలకు నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం కాస్త ఇండస్ట్రీలో రచ్చగా మారింది. దీనిపై తాజాగా.. త్రినాథ రావు సారీ చెబుతు ఒక వీడియో రిలీజ్ చేశారు. నా ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారని.. అనుకొకుండా నోరు జారానని చెప్పారు.

Read more: Mazaka Teaser Video: హీరోయిన్లకు అవి పెద్ద సైజ్‌లో ఉండాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్..

కావాలని చేసింది కాదని.. ఏదో నవ్విద్దామనుకుంటే.. ఇలా జరిగిందని క్లారిటీ ఇచ్చారు. మనస్పూర్తిగా హీరియిన్ అన్షుకు.. మహిళలు అందరికి క్షమాపణలు కోరుతున్నట్లు ఒక వీడియో రిలీజ్ చేశారు.  దయచేసి పెద్దమనస్సుతో అనుకొకుండా జరిగిన తప్పిదానికి క్షమించాలని రెండు చేతులు జోడించి మరీ వేడుకున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News