Balakrishna Dance with Urvashi Rautela: నందమూరి బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు వచ్చింది. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి.. తమన్ సంగీతం అందించారు. అదే విధంగా ఈ సినిమాలో.. బాలయ్య సరసన.. ప్రగ్యా జైశ్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా తదితరులు నటించారు. అయితే.. ఈ సినిమా నిన్న (జనవరి 12) న విడుదలైంది.
ముఖ్యంగా బాలయ్య బాబు.. డాకు మహారాజ్ మూవీని ఆయన అభిమానులంతా ఫుల్ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా థియేటర్ లన్ని జాతరను తలపిస్తున్నాయి. నిన్న పలు థియేటర్ లలో డీజేలు, డ్యాన్స్ లు చేస్తు... పొట్టెలును కోసి మరీ బాలయ్య ఫ్లెక్సీకి రక్త తికలం దిద్దారు. అంతేకాకుండా.. మరికొన్ని చోట్ల బాలయ్య బాబు ఫ్లెక్సీకి.. మద్యంతో అభిషేకం సైతం చేశారు. అయితే.. ప్రస్తుతం ఈ మూవీ మాత్రం అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో ఊర్వశి రౌతేలాతో బాలకృష్ణ స్టెప్పులు pic.twitter.com/UWKxRQbI1b
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025
ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్ కార్యక్రమంలో బాలయ్య బాబు.. నటి ఊర్వశి రౌతేలాతో రచ్చ చేశారు. నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ లోని దబిడి దిబిడి పాట ఎంత ఫెమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటు రిలీజ్ అయ్యాక.. చాలా మంది ఈ పాటకు కొరియో గ్రాఫర్ గాచేసిన శేఖర్ మాస్టర్ మీద నెటిజన్లు మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే, సీనియర్ నేతకు ఇలాంటి కొంచెం అసభ్యకరంగా చూపించే స్టెప్పులు ఇవ్వడం ఏంటని అప్పట్లోనే నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా.. డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో నటి ఊర్వశి రౌతేలాతో రెచ్చిపోయారు.
దబిడి దిబిడి పాటకు నటి ఊర్వశి రౌతేలాతో కలిసి బాలయ్య... మాస్ స్టెప్పులు వేశారు. ఆమె మోహమాట పడిన కూడా బాలయ్య మాత్రం తగ్గేదేలా అన్న విధంగా డ్యాన్స్ చేస్తు.. రచ్చ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు బాలయ్య బాబు డ్యాన్స్ ను ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు మా బాలయ్య బాబుతో అట్టుంటదీ.. దబిడి దిబిడే.. అంటూ కూడా ఆయనను ప్రశంసిస్తున్నారు. మొత్తానికి బాలయ్య వేసిన స్టెప్పులు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ గా మారిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter