Happy Sankranti 2025: సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడం. కానీ మన తెలుగు వారికి సంక్రాంతి అంటే మూడు రోజుల పాటు జరుపుకునే పెద్ద పండుగ. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఇది శుభకార్యాలకు అనువైన కాలంగా భావిస్తారు. ఈ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి గడుపుతారు. ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు వంటి సంప్రదాయాలు ఈ పండుగను మరింత ప్రత్యేకంగా చేస్తాయి. ఈ అద్భుతమైన పండుగ సందర్భంగా మీ ప్రియమైనవారికి తెలుగు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపండి ఇలా..
భోగభాగ్యాలతో.. సంక్రాంతి సిరిసంపదలతో జరుపుకోవాలని కోరుకుంటూ.. 2025 సంక్రాంతి శుభాకాంక్షలు!!
మీకు మీ కుటుంబ సభ్యులకు 2025 మకర సంక్రాంతి శుభాకాంక్షలు..!
సంక్రాంతి పండుగ మీకు సరికొత్త ఆనందాలివ్వాలని..మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు..
చెరకులోని తియ్యదనం, పాలలోని తెల్లదనం, గాలిపటంలోని రంగులు మీ జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు..
ఈ సంక్రాంతి మీ అందరికీ ఆనందాలని పంచాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
మన తెలుగు వారి పండుగ సంక్రాంతి మీకు ఎన్నో ఆనంద అనుభూతులను మిగల్చాలని కోరుకుంటూ.. మకర సంక్రాంతి శుభాకాంక్షలు!
మకర సంక్రాంతి శుభ సందర్భంగా మీకు చాలా అదృష్టం, ప్రేమ పొందాలని కోరుకుంటూ.. 2025 మకర సంక్రాంతి శుభాకాంక్షలు!
కళకళలాడే ముంగిట రంగవల్లులు మీకు సంతోషాన్ని పంచాలి సంక్రాంతి శుభాకాంక్షలు 2025 !
సంబరాల సంక్రాంతి మీ జీవితంలో సరికొత్త కాంతులు తేవాలని కోరుకుంటూ మీకు 2025 సంక్రాంతి శుభాకాంక్షలు!