Los Angeles Fire Disaster Reason: లాస్ ఏంజెల్స్ లో కారు చిచ్చు ఒక్కసారిగా వ్యాప్తి చెందుతోంది.. కొన్ని ప్రాంతాల్లో ఈ మంటలను అదుపు చేసినప్పటికీ ఏటోనో, పాలీసెడ్స్ వంటి ప్రాంతాలలో వ్యాపిస్తునటువంటి మంటలను మాత్రం పూర్తిగా అక్కడి ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందట. మరొకవైపు నూతన సంవత్సర వేడుకలలో భాగంగా కాల్చిన బాణసంచానే ఈ మంటల పుట్టడానికి కారణమైంది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 24 కి చేరిందట. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదంలో ఏటోనో ప్రాంతానికి చెందిన 16 మందికి పైగా ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారట.
అలాగే పాలీసెడ్స్ లో.. 8 మంది మరణించినట్లుగా అక్కడి నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ సంఖ్య రాబోయే కొన్ని గంటలలో పెరగవచ్చు అని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. పాలీసెడ్స్ 23,707 ఎకరాలు ఉండగా.. ఏటోనో 14,117 ఎకరాలు, అలాగే పూర్సేట్ 779 ఎకరాలు, కెన్నెత్ 1052 ఎకరాలు సైతం దగ్ధమైనట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. మొత్తం మీద 12 వేల నిర్మాణాలు ఈ అగ్నికి బూడిద అయ్యాయట. సుమారుగా 160 చదరపు కిలోమీటర్ల వరకు ఈ అగ్గి వల్ల కాలి బూడిదయ్యాయి అని అధికారులు తెలియజేస్తున్నారు.
అయితే ఈ అగ్గిని తగ్గించడానికి కొన్ని రసాయనాలు కలిపిన పోస్ చెక్ అనే మిశ్రమాన్ని కూడా సుమారుగా 9 విమానాలతోపాటు 20 హెలికాప్టర్ సహాయంతో ఆ ప్రాంతాల పైన స్ప్రే చేయడం కొంతమేరకు మంటలు చల్లారినట్లు సమాచారం. అయితే ఇది వెంటనే తగ్గిపోదని ఇవి తగ్గడానికి నెమ్మదిగా సమయం పడుతుందని అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. సుమారుగా పక్షులు కూడా అక్కడ చాలానే మరణించాయని తెలుపుతున్నారు. అయితే కారు చిచ్చుకి కారణం న్యూ ఇయర్ వేడుకలనే అనుమానాలను అక్కడ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సర సందర్భంగా కాల్చిన టపాకుల వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు తెలుపుతున్నారు. వీటికి తోడు అక్కడ బలమైన గాలులు వీచడం వల్ల ఈ కారు చిచ్చు పెరిగిపోయిందని ఒక కథనం ద్వారా కూడా వినిపిస్తోంది.
దీంతో అక్కడ కొంతమంది స్థానికులు సైతం ఖరీదైన వస్తువులను ఇళ్లను కూడా వదిలేసి బయటికి వచ్చేయడంతో చాలామంది దొంగలు అక్కడ దొంగతనం చేస్తున్నారట. సుమారుగా 30 మందిని పట్టుకున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా లాస్ ఏంజెల్ లో ప్రైవేటు డ్రోన్లు సైతం విమానాలకు చాలా ప్రాణాంతకరంగా మారుతున్నాయట. ఒక డ్రోన్ విమానాలకు ఢీకొట్టడంతో విమానం దెబ్బతినిందని.. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా ఉద్రితంగా ఉందని ఇలాంటి వేల డ్రోన్ల వల్ల ఇబ్బందిగా మారుతోందట.
Also Read: Kateri Halwa: సంక్రాంతి స్పెషల్.. అందరు తప్పకుండా తినే కాటేరీ హల్వా ఇలా ఈజీగా చేసుకొవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.