Rice Flour: బియ్యంపిండితో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోండి..

Rice Flour For Facial Hair Removal:  ఇందులో ఎక్స్‌ఫోలియేటింగ్‌ గుణాలు ఉంటాయి. ఇవి హెయిర్‌ ఫొలికల్స్‌ను బలహీనపరుస్తాయి. తద్వారా సహజసిద్ధంగాన ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. అంతేకాదు దీంతో మీ ముఖం అందంగా, కాంతివంతంగా కూడా కనిపిస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jul 25, 2024, 12:40 PM IST
Rice Flour: బియ్యంపిండితో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోండి..

Rice Flour For Facial Hair Removal: ముఖంపై అవాంఛిత రోమాలను తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం. ముఖ్యంగా సౌదర్యపరంగా బియ్యం పిండిని ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఎక్స్‌ఫోలియేటింగ్‌ గుణాలు ఉంటాయి. ఇవి హెయిర్‌ ఫొలికల్స్‌ను బలహీనపరుస్తాయి. తద్వారా సహజసిద్ధంగాన ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. అంతేకాదు దీంతో మీ ముఖం అందంగా, కాంతివంతంగా కూడా కనిపిస్తుంది. ఫేషియల్‌ హెయిర్‌ తొలగించుకోవడానికి బియ్యం పిండిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

బియ్యం పిండి మాస్క్‌..
రెండు టీస్పూన్ల బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి చిక్కని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇందులోనే కొన్ని తేనె చుక్కలు, రోజ్‌ వాటర్ వేసుకోవచ్చు. మీ ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో అప్లైచేసుకోవాలి. ఇది అవాంఛిత రోమాలను పెరగనివ్వకుండా చేస్తుంది. ఈ పేస్ట్‌తో మృదువుగా మసాజ్‌ చేయండి. ఓ 10 నిమిషాల తర్వాత మరో 20 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్‌ వాష్‌ చేయాలి. ఈ ప్యాక్‌ వారానికి మూడుసార్లు వేసుకోవచ్చు.

బియ్యం పిండి, పసుపు..
బియ్యం పిండి రెండు స్పూన్లు, పుసుపు ఒక స్పూన్‌ తగినంత రోజ్‌ వాటర్‌ వేసి మందపాటి పేస్ట్‌ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ ముఖానికి అప్లై చేసి ఓ 20 నిమిషాలు ఆరనివ్వాలి. మృదువుగా స్క్రబ్‌ చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగి మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి. దీంతో గ్లోయింగ్‌ స్కిన్‌ మీ సొంతం.

ఇదీ చదవండి: ఈ టీ జాయింట్ పెయింట్స్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ రెమిడీ.. మ్యాజికల్ బెనిఫిట్స్‌ కలుగుతాయి..

బొప్పాయి..
పండిన బొప్పాయిని రెండు స్పూన్ల బియ్యం పిండిలో వేసుకోవాలి. అందులోనే తేనె వేసి పేస్ట్‌ తయారు చేయాలి. ఇది ముఖానికి మాయిశ్చర్‌ అందిస్తుంది. ఈ పేస్ట్‌ను ముఖానికి అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. ఓ అరగంట తర్వాత ఫేస్‌ వాష్‌ చేయాలి. గోరువెచ్చని నీటితో ఫేస్‌ వాష్ చేయాలి.ఈ ప్యాక్‌ వారానికి మూడుసార్లు వేసుకోవచ్చు.

ఇదీ చదవండి:  ఈ 5 ఆహారాలు మీకు హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి.. మీ డైట్ లో తప్పక ఉండాల్సినవి..

ఎగ్‌వైట్‌ మాస్క్‌..
బియ్యం పిండి రెండు స్పూన్లు, ఎగ్‌ వైట్‌  కూడా యాడ్‌ చేయాలి. ఇది పేస్ట్‌ మాదిరి తయారు చేసుకుని అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఓ 20 నిమిషాల తర్వాత ఈ మాస్క్‌ను పీల్‌ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్‌ చేయాలి. ఈ ప్యాక్‌ వారానికి మూడుసార్లు వేసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News