Tamil Nadu: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’..

Hero Vijay: తమిళనాడు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో దళపతి విజయ్ అభ్యర్థులు సత్తా చాటారు. దీంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి మార్గం సుగమమైంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 07:34 PM IST
Tamil Nadu: స్థానిక సంస్థల ఎన్నికల్లో  సత్తా చాటిన ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’..

Tamil Nadu rural local body election: తమిళనాడు రాష్ట్రంలోని 9 జిల్లాల్లో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నిక(Tamil Nadu rural local body election)ల్లో స్వతంత్రులుగా పోటీ చేసిన దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం (టీవీఎంఐ) అభ్యర్థులు సత్తాచాటారు. రాజకీయాల్లోకి ఇయక్కం గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిందని సభ్యులు తెలిపారు. 

ఖాతా తెరవని కమల్ పార్టీ
నటుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan) నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం(Makkal Needhi Maiam), అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఓటింగ్‌ శాతం పొందిన సీమాన్‌ నేతృత్వంలోని నామ్‌ తమిళర్‌ కట్చి ఖాతా కూడా తెరవలేదు. నటుడు విజయ్‌(Thalapathy Vijay) రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు స్థానిక ఎన్నికలు ఉత్సాహాన్ని కల్గించాయి. ముఖ్యంగా కళ్లకురిచ్చి, విళ్లుపురం, కాంచీపురం జిల్లాల్లో సత్తా చాటారు.

ఇయక్కం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఎన్‌.ఆనంద్‌ మాట్లాడుతూ... మొత్తం 169 మంది పోటీ చేయగా 121 మంది గెలిచారని తెలిపారు. ఎన్నికల్లో భాగంగా తాను 9 జిల్లాలను సందర్శించినట్లు, ఈ క్రమంలో ప్రజలు ఇయక్కం(Vijay Makkal Iyakkam) సభ్యులకు ఓటేస్తారన్న నమ్మకం కలిగిందన్నారు. విళ్లుపురం జిల్లా వానూర్‌ పంచాయతీ యూనియన్‌లో టీవీఎంఐకి చెందిన సావిత్రి పంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు తెలిపారు. మహిళలు, యువత, విద్యార్థులు విజయ్‌పై గొప్ప అభిమానాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగనున్న పట్టణ స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆనంద్‌ అన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News