Awadhesh Prasad: అయోధ్యలో బీజేపికి ఝలక్ ఇచ్చిన ఎస్పీ లీడర్ అవధేశ్ ప్రసాద్.. ? ఆయన గెలుపు వెనక కారణాలు అవేనా.. ?

Awadhesh Prasad: అయోధ్య రామ జన్మభూమి  భారతీయ జనతా పార్టీ ఊపిరి ఒదిలిన కార్యస్థలం. అక్కడ రామ మందిరం కడతామని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు అక్కడ ఎంతో భవ్యమైన రామ మందిరం నిర్మించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలాంటి పవిత్ర స్థలంలో బీజేపీకి అక్కడి ఓటర్లు ఝలక్ ఇచ్చి ఎప్పీ అభ్యర్ధి అవదేశ్ ప్రసాద్ గెలిచి సంచలనం రేపారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 6, 2024, 06:06 PM IST
Awadhesh Prasad: అయోధ్యలో బీజేపికి ఝలక్ ఇచ్చిన ఎస్పీ లీడర్ అవధేశ్ ప్రసాద్.. ? ఆయన గెలుపు వెనక కారణాలు అవేనా.. ?

Awadhesh Prasad: భారతీయ జనతా పార్టీకి జవసత్వాలు ఇచ్చిన అంశం అయోధ్య రామ జన్మభూమి. బీజేపీ చెప్పిన మూడు ముఖ్యమైన మేనిఫెస్టోలో మొదటిది అయోధ్యలో రామ మందిరం,  రెండోది జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, మూడోది యూనిఫార్మ్ సివిల్ కోడ్. ఈ మూడింట్లో అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు చేసిన ఇచ్చిన మాట నిలబెట్టుకుంది భారతీయ పార్టీ. ఈ సారి టర్మ్ లో యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఒకటే బీజేపీ హార్ట్ కోర్ లిస్టులో పెండింగ్ లో ఉంది. ఆ సంగతి పక్కన పెడితే..2024 ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా హిందూ హార్ట్ కోర్ బెల్ట్ అయిన ఉత్తర ప్రదేశ్ లో గతంలో కంటే సగానికి సీట్లు తగ్గాయి. ఈ ఎన్నికల్లో 80 పార్లమెంట్ సీట్లలో బీజేపీ కేవలం 33 సీట్లకే పరిమితమైంది. అటు ఎస్పీ 37 సీట్లతో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 6, RLD 2, ASPKR 1, అప్నాదళ్ 1 సీట్లు దక్కాయి.
అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య రామ మందిరం కొలువైన ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీకి ఓటర్లు ఝలక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి లల్లూ సింగ్ పై  ప్రత్యర్ధి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధి దళిత నేత అవధేశ్ ప్రసాద్ 54,567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ప్రసాద్ నాన్ రిజర్వ్ ఎంపీ సీటులు ఎంపీగా గెలవడంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు ఎస్పీకి చెందిన యాదవ పార్టీలో ప్రముఖ దళిత నేతగా ఎదిగారు. 77 యేళ్ల అవదేశ ప్రసాద్ 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇపుడు ఫస్ట్ టైమ్ ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఎస్సీల్లో పాసి సామాజిక వర్గానికి చెందిన ఈయన ఎస్పీ వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. 1974 నుండి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ కు కుడిభుజం వ్యవహరించారు.
ఈయన లక్నో యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేట్ పూర్తి చేసారు. 21 యేళ్ల చిన వయసులో క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి అంచలంచెలుగా ఎదిగారు. ముందుగా మాజీ ప్రధాన మంత్రి భారతరత్న చౌదరి చరణ్ సింగ్ కు చెందిన భారతీయ క్రాంతి దళ్ లో రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. తొలిసారి అయోధ్యలోని సోహవాల్ నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

1977 ఎన్నికల తర్వాత జనతా పార్టీ చీలిపోవడంతో 1992లో ములాయం సింగ్.. సమాజ్ వాదీ పార్టీ స్థాపించినపుడు ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు. అంతేకాదు ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా మరియు ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా నియమితులయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు.

తొలిసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనా.. 1996లో ఒకసారి అక్బర్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాదు సమాజ్ వాదీ పార్టీ దళిత  ముఖంగా ఉన్న ఈయన తొలిసారి బీజేపీకి కీలకమైన స్థానం అయిన ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలవడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అయోధ్యలో ప్రజలు బీజేపిని ఎందుకు తిరస్కరించారు. అక్కడ రామ మందిరం కట్టడం స్థానికులను ప్రభావితం చేయలేదా అనే అంశంపై స్థానికులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

అయోధ్యలో అభివృద్ధి పేరిట విమానాశ్రయం, రోడ్ల కోసం భూసేకరణలో చాలా మంది స్థానికులకు సరైన పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలున్నాయి. భూములకు బదులు అయోధ్యలో షాప్స్ ఇస్తామన్న ప్రభుత్వహామి ఇంకా నెరవేర్చలేదని చెబుతున్నారు. భారీగా పెరిగిన నిత్యావసర ధరలు.. నిరుద్యోగం..వంటివి ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తున్నారు. పైగా అగ్నివీర్, రాజ్యాంగ మార్పుతో రిజర్వేషన్లు తీసేస్తారన్న విపక్షాలు చెప్పిన మాటలు కూడా ఓటమికి కారణాలుగా చెబుతున్నారు.

Also read: Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News