న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భయంకరంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి రోజు రోజుకు వేలకొద్దీ మరణాలకు గురిచేస్తోంది. అయితే మరోవైపు స్టాక్ మార్కెట్లను సైతం హడలెతిస్తోంది. గత కొన్నివారాల నుంచి డౌన్ ట్రెండ్ లో నడుస్తున్న మార్కెట్లు ఇప్పటికీ కోలుకోలేక చతికిలపడిపోయాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా నష్టాల బాట పట్టాయి. లక్షల కోట్లు గంటల వ్యవధిలో కనుమరుగవుతున్నాయంటే అంతా కరోనా(Also Read: 3.2 లక్షల మంది కరోనా రోగుల కోసం 20,000 బోగీలతో ఐసోలేషన్ వార్డులు) మహమ్మారి ఆందోళనే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: మరణమృదంగాన్ని మ్రోగిస్తూన్న కరోనా...
ప్రధానంగా సెన్సెక్స్ ఓ త్రైమాసికంలో ఇంత దారుణంగా నష్టపోవడం స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే ప్రథమమని, జనవరి-మార్చి త్రైమాసికంలో సెన్సెక్స్ సూచీ 28.6 శాతం పతనమైందని అన్నారు. మరోవైపు నిఫ్టీ సైతం అందుకు మినహాయింపు కాదని, 1992 తర్వాత 29.3 శాతం తగ్గుదలతో అతిపెద్ద పతనం ఎదుర్కొందని అంటున్నారు. అంతేకాదు 2019-20 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 23 శాతానికి పైగా పతనంకాగా, నిఫ్టీ 26శాతం తరుగుదుల నమోదుచేసింది. ఈ దశాబ్దకాలంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇంత దయనీయ పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Coronaeffect: ఇంత దయనీయ పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదు..