రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ గ్యాస్ ట్యాంకర్ మరో గ్యాస్ ట్యాంకర్‌ని ఢీకొని పేలుడు చోటుచేసుకున్న ఘటనలో మరో 5 వాహనాలు దగ్ధమయ్యాయి. శనివారం రాత్రి ఉత్తర్ ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ వేపై మధురకు సమీపంలోని సురిర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ట్యాంకర్‌ని ఢీకొని పేలుడు జరగగా అప్పుడు ఆ రెండు వాహనాలకు సమీపంలోనే ఉన్న మరో 5 వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది పైర్ ఇంజిన్లతో అక్కడికి చేరుకునే లోపే వాహనాలన్ని అగ్నికి ఆహుతయ్యాయి.
Visuals from Mathura: A gas tanker had exploded on Yamuna expressway after it rammed into another gas tanker in Surir near Milestone 85. The fire which engulfed 5 other vehicles, was later brought under control by fire tenders. 3 people critically injured. Police present. pic.twitter.com/BQbxOwxibF
— ANI UP (@ANINewsUP) October 28, 2018
ఇదిలావుంటే, ఇదే యమునా ఎక్స్‌ప్రెస్‌పై అలీఘర్ జిల్లా తప్పల్ వద్ద చోటుచేసుకున్న మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ఢిల్లీ నుంచి ఆగ్రాకు వెళ్తున్న టూరిస్ట్ బస్సును వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.