Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై శనివారం రాత్రి కాల్పులు జరిపారు. దీంతో సిద్ధిఖీని వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఓ ఇద్దరు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు అతి సన్నిహితుడు బాబా సిద్ధిఖీ. విషయం తెలుసుకున్న సల్మాన్ రాత్రి లీలావతి ఆస్పత్రికి హుటాహుటిన చేరుకున్నారు. అప్పట్లో ఇద్దు ఖాన్‌ల మధ్య విభేదాలు వచ్చినప్పుడు సిద్ధికీ సయోధ్య కుదుర్చారు.
మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ హత్య ముంబైలో తీవ్ర కలకలంరేపుతోంది. దీనికి సీఎం ఏక్‌నాథ్ షిండే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఎన్సీపీ, శివసేనలు డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ నేతను అది కూడా Y కేటగిరీ భద్రత కలిగిన లీడర్‌నే కాపాడలేకపోయారు ఇక సాధారణ ప్రజలను ఏం కాపాడతారని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రాథమిక వివరాల ప్రకారం సిద్దిఖీ తన కొడుకు ఆఫీసు కింద ఉన్న సమయంలో ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు రెండు మూడు రౌండ్ల గన్‌షాట్లను సిద్ధిఖీని కాల్చారని తెలుస్తోంది. వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈలోగా ఈ మాజీ మంత్రి మృతిచెందారు. అయితే, అతని ప్రాణాలకు ముప్పు ఉందని 15 రోజుల కిందటే తెలిసింది. దీంతో సిద్ధిఖీకి Y కేటగిరీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: పది పాసైతే చాలు రూ. 12,000 స్కాలర్‌షిప్ పొందవచ్చు.. ఇలా అప్లై చేసుకోండి..!
బాబా సిద్దిఖీ ఎవరు?
బాబా సిద్దికీ బిహార్‌కు చెందిన వ్యక్తి. ఈయన ఎన్సీపీ పార్టీలోకి చిన్న వయస్సులోనే చేరారు. నేషనల స్టూడేంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) టీనేజీ వయస్సులోనే రాజకీయల్లోకి అడుగు పెట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీ కింద పనిచేస్తోంది. ఆ తర్వాత సిద్దిఖీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. వరుసగా 1999, 2004 రెండుసార్లు వంద్రే వెస్ట్ విధాన సభ నియోజకర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు సివిల్ సప్లై, లేబర్, ఎఫ్‌డీఏ మంత్రిగా కూడా పనిచేశారు.
ఇదీ చదవండి: Salary Hike: ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్.. టీచర్ల జీతం మూడురెట్ల పెంపు..!
ఈ ఫిబ్రవరిలోనే సిద్దిఖీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అజిత్ పవార్ ఆధ్వర్యంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లభించలేదని తనను కూరలో కరివేపాకును తీసి పక్కనబెట్టినట్లు పార్టీలో వ్యవహరించారు అన్నారు. ఇక సిద్దిఖీ కొడుకు జీషాన్ కూడా ముంబై బాంద్రా ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అభియోగాలతో ఆగష్టులో జీషాన్‌ను తొలగించారు. సిద్దిఖీ ఒకానొక సమయంలో ఇఫ్తార్ పార్టీ ఇచ్చినప్పుడు బాలీవుడ్ బడా నటులు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లు సైతం హాజరయ్యారు. ఇతనికి బాంద్రా బాయ్ అని కూడా పిలుస్తారు. అప్పట్లో ఇద్దరు ఖాన్‌ల మధ్య ఉన్న వివాదాన్ని తొలగించి సయోద్యను కుదుర్చారు. అప్పటి నుంచి సిద్దిఖీ ఈ ఘటనతో మరింత పాపులర్ అయ్యారు.
శనివారం రాత్రే ఈ మర్డర్‌కు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధించి ఇంటరాగేషన్ కూడా ప్రారంభించారు. ఈ హత్యతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు ఏమైనా సంబంధం ఉందా? అని ఆరాతీస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు దీని గురించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సల్మాన్ ఖాన్‌కు , సిద్దిఖీ అత్యంత సన్నిహితుడు కాబట్టి బిష్ణోయ్ గ్యాంగ్ కుట్రకోణం ఏమైనా ఏమైనా ఉండవచ్చు అనే అనుమానిస్తున్నారు పోలీసులు.
The Mumbai Congress is deeply saddened by the passing of Baba Siddique Ji. His tireless service to the people and his dedication to the community will forever be remembered.
Our thoughts and prayers are with his family and loved ones during this difficult time.
May his soul… pic.twitter.com/gjkZIFeLFn
— Mumbai Congress (@INCMumbai) October 12, 2024
లారెన్స్ బిష్ణోయ్‌కి సంబంధం ఉందా?
శనివారం రాత్రే ఈ మర్డర్‌కు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధించి ఇంటరాగేషన్ కూడా ప్రారంభించారు. ఈ హత్యతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు ఏమైనా సంబంధం ఉందా? అని ఆరాతీస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు దీని గురించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సల్మాన్ ఖాన్‌కు , సిద్దిఖీ అత్యంత సన్నిహితుడు కాబట్టి బిష్ణోయ్ గ్యాంగ్ ఈ హత్య చేసి ఉండవచ్చు అనే కోణంలో అనుమానిస్తున్నారు పోలీసులు.ఘటన స్థలంలో 9.9 ఎంఎం పిస్తాల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
1998 సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసు నుంచి ఈ బిష్ణోయ్ గ్యాంగ్ ఆయన్ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు సల్మాన్ ఖాన్‌పై కూడా ఈ గ్యాంగ్ హత్యాయత్నానికి పాల్పడింది. దీంతో సిద్ధిఖీ మర్డర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్‌కు ఏమైనా సంబంధం ఉందా? అని పోలీసులు విచారిస్తున్నారు. సిద్దిఖీ మృతిపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు తమ సంతాపాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఈయన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్‌కు అత్యంత సన్నిహితుడు. ఇఫ్తార్ పార్టీలు ఇవ్వడంలో కూడా సిద్దిఖీ మరింత ఫేమస్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.