E-shram card benefits: అసంఘటిత రంగాల్లో పని చేసే వారికి సహాయం చేసేందుకు గానూ.. కేంద్రం లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వ శాఖ 2021 ఆగస్టు 26న ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. వలస కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, ఇళ్లల్లో పని చేసే వారు, వీధి వ్యాపారులు, వెయిటర్స్, బ్యుటీషియన్స్, హస్తకళా కార్మికులు, వ్యవసాయ కార్మికులు సహా.. వివిధ పనులు చేసే వారికోసం ఈ పోర్టల్‌ను అందుబాటులోకి (e-shram card benefits) తెచ్చింది.
ఈ-శ్రమ్ కార్డు ఉపయోగాలు..
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సమాజిక భద్రత సేవలను మరింత కచ్చితత్వంతో అందించాలనేదే దీని (e-shram card use) ముఖ్య ఉద్దేశం.
లేబర్, ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వ శాఖ సహా ఇతర శాఖలు అందించే సంక్షేమ పథకాలను ఏకీకృతం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
అసంఘటిత రంగాల్లోని కార్మికుల డేటాబేస్ కోసం.. ఆధార్ అనుసంధానంతో ఈ-శ్రమ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది కేంద్రం.
ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద.. రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా (Insurance with e-shram card) వర్తిస్తుంది.
భవిష్యత్‌లో అసంఘటిత ప్రభుత్వం అందించే పథకాల ప్రయోజనాలన్నీ నేరుగా ఈ పోర్టల్ ద్వారానే ఇచ్చే అవకాశముంది.
అత్యవసర పరిస్థితి ఏర్పడితే అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సహాయం చేసేందుకు కూడా ఈ పోర్టల్ ఉపయోగపడనుంది.
కార్డు ఎలా పొందాలి?
అసంఘటిత రంగాల్లో పని చేసే 16-59 ఏళ్ల మధ్య వారు ఎవరైనా ఈ పోర్టలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీఎస్సీ, స్టేట్ సేవా కేంద్ర (ఎస్ఎస్కే)లలో ఎక్కడైనా ఉచితంగా రిజిస్ట్రేషన్ (How to get e-shram card) చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ పూర్తయిన వాళ్లకు.. 12 అంకెల యూఏఎన్‌తో కూడిన ఈ-శ్రమ్ కార్డును పొందుతారు. ఈ నంబర్ వచ్చినవారు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా సామాజిక సంక్షేమ పథకాల కింద ప్రయోజనాలు (e-shram card full details) పొందగలుగుతారు.
ఈ యూఏఎన్ నంబర్ ప్రతి ఒక్కరికి వేర్వేరుగా ఉంటుంది. ఇది శాశ్వత నంబర్. అంటే ఒకవేళ కార్ట్ పోయినా.. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆ నంబర్‌తోనే కొత్త కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది.
సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?
- ముందుగా ఈ 'E-Shram’ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి
- మెయిన్ పేజీలోనే రిజిస్ట్రేషన్ అప్షన్ కనిపిస్తుంది.. దానిపై క్లిక్ చేయాలి
- ఇక్కడ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసీ ఓటీపీపై క్లిక్ చేయాలి
- ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్కో ఓ ఓటీపీ వస్తుంది.. అప్పుడు ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది
- ఇందులో వ్యక్తిగత, విద్య సంబంధి వివరాలతో పాటు బ్యాంక్ ఖాతా నంబర్ వివరాలు సమర్పించాలి
- అన్ని వివరాలు సమర్పించి సబ్మిట్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుంది
Also read: SBI: ప్రెగ్నెంట్ విమెన్ టెంపరరీ అన్‌ఫిట్.. ఆ గైడ్‌లైన్స్‌ను ఉపసంహరించుకున్న ఎస్‌బీఐ
Also read: Budget 2022: మోదీ సర్కార్ రాకతో బడ్జెట్ సాంప్రదాయాల్లో వచ్చిన మార్పులివే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook