COVID-19 vaccine ZyCoV-D : 7 రాష్ట్రాల్లో చిన్నారులకు జైకోవ్‌-డీ కోవిడ్ వ్యాక్సిన్‌

ZyCoV-D Covid vaccine in 7 states : చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగానే జైడస్‌ క్యాడిలా రూపొందించిన జైకోవ్‌ - డీ వ్యాక్సిన్‌ను మొదట 7 రాష్ట్రాల్లో అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 09:12 PM IST
  • చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు
  • జైడస్‌ క్యాడిలా రూపొందించిన జైకోవ్‌ - డీ వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధం
  • మొదట 7 రాష్ట్రాల్లో అందించేందుకు ఏర్పాట్లు
COVID-19 vaccine ZyCoV-D : 7 రాష్ట్రాల్లో చిన్నారులకు జైకోవ్‌-డీ కోవిడ్ వ్యాక్సిన్‌

COVID-19 vaccine ZyCoV-D to be initially introduced in these 7 states : దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. ఇక తాజాగా ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) మనదేశంలో కూడా వెలుగు చూసింది. ఒమిక్రాన్ కేసుల్ని మన దేశంలో గుర్తించిన విషయం తెలిసిందే. 

ఇది ఇలా ఉంటే.. చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్‌ (Covid vaccine‌) ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే జైడస్‌ క్యాడిలా (Zydus Cadila) రూపొందించిన జైకోవ్‌ - డీ (ZyCoV-D) వ్యాక్సిన్‌ను మొదట 7 రాష్ట్రాల్లో అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే బిహార్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, తమిళనాడు, (Tamil Nadu) పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ వ్యాక్సిన్ అందించనున్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను సూది అవసరం లేకుండానే ఇస్తారు. దీనిపై ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ పూర్తయింది.

Also Read : Omicron cases in India: కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు.. కేంద్రం ఏం చెబుతోందంటే..

మూడు డోసుల్లో జైకోవ్‌ డీ వ్యాక్సిన్ (ZyCoV-D Covid vaccine) ఇవ్వనున్నారు. 12 సంవత్సరాలు పైబడిన వారి వినియోగం కోసం ఈ ఏడాది ఆగస్టు 20నే కేంద్రం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక జైడస్‌ క్యాడిలా రూపొందించిన ఈ వ్యాక్సిన్ ప్రపంచంలోనే మొదటి డీఎన్‌ఏ ఆధారిత కోవిడ్‌ వ్యాక్సిన్. 

ఇక జైకోవ్‌ - డీ వ్యాక్సినేషన్‌లో (ZyCoV-D Covid vaccine) భాగంగా ఇప్పటికే కోటి డోసులను కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆర్డర్ చేసింది. సూది అవసరం లేకుండా జైకోవ్‌ - డీ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం జెట్‌ అప్లికేటర్‌ ను ఉపయోగించాల్సి ఉంటోంది. మొత్తానికి జైకోవ్‌ - డీ ఒక డోసుకు దాదాపు రూ.358 వెచ్చించాల్సి వస్తుంది. 

Also Read : Breaking News: అప్పుడు కేరళ.. ఇప్పుడు కర్ణాటక.. భారత్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు- థర్డ్ వేవ్ కు సంకేతమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News