Corona Updates in India: భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు వైరస్ కోరలు చాస్తోంది. గతకొంతకాలంగా 10 వేలకు పైగా రోజువారి కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఆ కేసులు 18 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4.52 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా..18 వేల 819 కరోనా కేసులు వెలుగు చూశాయి. కోవిడ్ వల్ల 39 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో యాక్టివ్ కేసులు సైతం కలవర పెడుతోంది.
ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు లక్షా 4 వేల 555గా ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 4.16 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో ఒక్క కేరళలో 4 వేల 459, మహారాష్ట్రలో 3 వేల 957లు నమోదు అయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో వెయ్యి మందికి కరోనా సోకింది. మరోవైపు రికవరీ రేటు సైతం పెరుగుతోంది. 24 గంటల్లో 13 వేల 827 మంది కోలుకున్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 14.17 లక్షల మందికి వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 197.61 కోట్ల డోసులు పంపిణీ చేశారు.
#COVID19 | India reports 18,819 fresh cases and 39 deaths, in the last 24 hours.
Active cases 1,04,555
Daily positivity rate 4.16% pic.twitter.com/A0RaRud8Nr
— ANI (@ANI) June 30, 2022
Also read:TS SSC Results 2022: నేడే పదో తరగతి ఫలితాలు... విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
Also read: India vs England: రేపటి నుంచి ఇంగ్లండ్, భారత్ ఏకైక టెస్ట్ మ్యాచ్..టీమిండియా కెప్టెన్ అతడే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.