పరీక్షల్లో పాస్ చేయిస్తానని చెప్పి రేప్ చేశాడు

పాఠాలు చెప్పిన గురువే కీచక అవతారం ఎత్తాడు. పరీక్షల్లో పాస్ చేయిస్తానని చెప్పి.. ఓ పదవ తరగతి విద్యార్థినిపై స్వయానా ప్రిన్సిపల్‌యే అత్యాచారం చేశాడు.

Last Updated : Mar 15, 2018, 12:56 PM IST
పరీక్షల్లో పాస్ చేయిస్తానని చెప్పి రేప్ చేశాడు

పాఠాలు చెప్పిన గురువే కీచక అవతారం ఎత్తాడు. పరీక్షల్లో పాస్ చేయిస్తానని చెప్పి.. ఓ పదవ తరగతి విద్యార్థినిపై స్వయానా ప్రిన్సిపల్‌యే అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానాలో ఓ ప్రైవేటు స్కూలులో చదువుతున్న విద్యార్థిని చదువులో బాగా వెనుకబడి ఉండడంతో.. ఆమె తండ్రి ఎలాగైనా తన కుమార్తెను పాస్ చేయించమని స్కూలు ప్రిన్సిపల్‌ని కోరాడు.

అందుకు ప్రిన్సిపల్ రూ.10,000 డిమాండ్ చేస్తూ.. అంత మొత్తం చెల్లిస్తే.. ఆ విద్యార్థినికి బదులుగా వేరే విద్యార్థినిని పరీక్ష రాయించడానికి పంపిస్తానని నమ్మబలికాడు. అయితే పరీక్ష అయ్యేంత వరకు సదరు విద్యార్థిని తన స్కూలులోనే ఉండాలని తెలిపాడు. ఆయన మాటలకు విద్యార్థిని తండ్రి అంగీకరించాక.. పరీక్ష జరుగుతున్న సమయంలో తన స్కూలుకి వచ్చిన విద్యార్థినిపై బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇంటికి వచ్చాక.. తన కుటుంబ సభ్యులతో జరిగిన విషయం విద్యార్థిని చెప్పడంతో వారు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు.

హర్యానాలో వారాల వ్యవధిలోనే వివిధ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థినులపై వివిధ సందర్భాల్లో అత్యాచారం జరిగిన ఘటనలు వెలుగులోకి రావడం గమనార్హం. ఈ అంశంపై చర్చించేందుకు ఆ రాష్ట్ర డీజీపీ బీఎస్ సంధూ పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాఠశాలలు, కళాశాలల వద్ద ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. తాజా కేసులో విద్యార్థినిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్ పై వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా పోస్కో యాక్ట్ ప్రకారం ప్రిన్సిపల్‌ను బుక్ చేశారు

Trending News