Rajnath Singh Corona: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) కరోనా (Covid-19) బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్న కారణంగా హోం క్వారెంటైన్‌కే పరిమితం అయిట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. జనవరి 8న రాజ్ నాథ్ ఒక వెబ్‌నార్‌లో ప్రసంగించారు. సాయుధ దళాలలో చేరడానికి బాలికలకు అవకాశాలను కల్పించడానికి.. దేశంలో 100 కొత్త సైనిక్ పాఠశాలలను (Sainik Schools) ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
I have tested positive for Corona today with mild symptoms. I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested.
— Rajnath Singh (@rajnathsingh) January 10, 2022
ఐదు రోజుల క్రితం రాజ్‌నాథ్.. వాయుసేన అధికారులతో భేటీ అయ్యారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఐఏఎఫ్ చీఫ్.. రాజ్‌నాథ్‌ను (Rajnath Singh) కలిసి నివేదిక సమర్పించారు. ఇటీవల కేంద్రమంత్రులు భారతి పవార్, మహేంద్ర నాథ్ పాండే, నిత్యానంద్ రాయ్‌తో పాటు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, భాజపా ఎంపీలు మనోజ్ తివారీ, వరుణ్ గాంధీ తదితరులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
Also Read: No lockdown in Delhi : ఢిల్లీలో లాక్‌డౌన్ ఉండదు కానీ వాటన్నింటిపై నిషేధం
దేశంలో గడిచిన 24 గంటల్లో 1,79,723 మంది వైరస్ (Corona cases in India) బారిన పడ్డారు. కరోనా వల్ల మరో 146మంది మృతి చెందారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరాయి. దిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ కొత్త కేసులు పెరుగుతుండగా.. నిన్న ఒక్కరోజే 22వేలకు (Corona cases in Delhi) పైగా మందికి పాజిటివ్‌గా తేలింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా