BJP chief tests positive : వరుసగా కోవిడ్ బారినపడుతోన్న బీజేపీ నేతలు.. అధ్యక్షుడికి కరోనా!

BJP chief JP Nadda tests positive for Covid-19 : బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డాకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. వరుసగా కోవిడ్ బారినపడుతోన్న రాజకీయ నాయకులు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 10:36 PM IST
  • దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు
  • కోవిడ్ బారినపడుతోన్న రాజకీయ నాయకులు
  • బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డాకు కోవిడ్‌ పాజిటివ్
BJP chief tests positive : వరుసగా కోవిడ్ బారినపడుతోన్న బీజేపీ నేతలు.. అధ్యక్షుడికి కరోనా!

BJP chief JP Nadda tests positive for Covid-19 isolates self : దేశంలో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. రోజూ లక్షల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సాధారణ పౌరులతో పాటు వరుసగా ప్రముఖులు కోవిడ్‌ బారినపడుతున్నారు. దేశ వ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులకు ఇప్పటికే కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 

తాజాగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో (Union Minister Rajnath Singh) పాటు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మె, (Karnataka CM Basavaraj Bommai) బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తదితరులు కోవిడ్ బారినపడిన విషయం తెలిసిందే. 

ఇలా చాలా మంది రాజకీయ ప్రముఖులకు కోవిడ్ పాజిటివ్‌గా (Covid Positive‌) తేలింది. కొందరికి స్వల్ప లక్షణాలుండగా.. మరికొందరు తీవ్రమైన లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. 

కోవిడ్ (Covid) బారినపడ్డ ప్రముఖుల్లో చాలా మంది హోం ఐసోలేషన్‌లో (Home Isolation‌) ఉంటున్నారు. ఈ క్రమంలో కోవిడ్ మరింత వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు. 

Also Read : Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​కు కరోనా

ఇక తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా (BJP chief JP Nadda) కోవిడ్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని జేపీ నడ్డా తెలిపారు. అలాగే గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కూడా కోవిడ్ (Covid) టెస్ట్‌లు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తనకు కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో వెంట‌నే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని జేపీ నడ్డా పేర్కొన్నారు. డాక్ట‌ర్ల స‌ల‌హా మేరకు ఇంటిలోనే ఐసోలేట్ అయ్యానని తెలిపారు. ఇక ఇప్పటికే ప‌లువురు బీజేపీ నేత‌లు, కేంద్ర మంత్రులు కోవిడ్ బారినపడ్డారు.

 

Also Read : Lockdown in India: సంక్రాంతి తర్వాత దేశంలో మరోసారి లాక్ డౌన్!- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News