Biperjoy Cyclone Alert: అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుపాను రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని ఐఎండీ స్పష్టం చేసింది. అతి తీవ్ర తుపానుగా మారడంతో మూడు రాష్ట్రాలకు హెచ్చరిక జారీ అయింది. మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
ఓ వైపు దక్షిణాదిని వేసవి అల్లాడిస్తోంది. మరోవైపు రుతు పవనాల రాక ఆలస్యం కావడంతో జనం విలవిల్లాడుతున్న పరిస్థితి. ఇంకోవైపు భారతదేశ పశ్చిమ తీరాన అతి తీవ్ర తుపాను పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను బలపడి తీవ్ర తుపానుగా మారింది. మరో 12 గంటల్లో అతి బీకర తుపానుగా మారనుందని ఐఎండీ హెచ్చరించింది. ప్రస్తుతం గుజరాత్ తీరప్రాతం పోరు బందర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన బిపర్‌జోయ్ తుపాను రానున్న 3 రోజుల్లో ఉత్తర పశ్చిమ దిశగా కదలవచ్చని అంచనా. అంటే పోరు బందర్ కు 200-300 కిలోమీటర్ల దూరం నుంచే వెళ్లిపోవచ్చని..గుజరాత్‌కు ముప్పు లేనట్టేనని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే తుపాను ప్రభావంతో రానున్న వారం రోజుల్లో గుజరాత్‌లో భారీ వర్షాలు పడనున్నాయి. దాంతోపాటు గోవా, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది. మత్స్యకారులు వచ్చే వారం రోజుల వరకూ వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ అయింది. బిపర్‌జోయ్ తుపాను ప్రభావంతో గుజరాత్ తీరం వెంబడి భారీగా కెరటాలు ఎగిరిపడనున్నాయి. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి భారీగా ఈదురుగాలులు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చని అంచనా. గుజరాత్ రాష్ట్రానికి మాత్రం ముప్పు ఉండకపోవచ్చని..కానీ బిపర్‌జోయ్ తుపాను ప్రభావంతో కచ్-సౌరాష్ట్ర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీయవచ్చని అంచనా.
Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక.. డీఏ 4 శాతం పెరిగితే.. జీతం ఎంత వస్తుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Biperjoy Cyclone Alert: అతి భీకర తుపానుగా మారనున్న బిపర్‌జోయ్, తీరం దాటేది ఎక్కడ