Benefits of Loquat Fruit: లొకట ఫ్రూట్ తో 8 రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌ వెన్నలా కరడం ఖాయం!

Reduce Bad Cholesterol with Loquat Fruit: లొకట పండు ప్రతి రోజూ తినడం వల్ల సులభంగా శరీరంలో పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2023, 11:13 AM IST
Benefits of Loquat Fruit: లొకట ఫ్రూట్ తో 8 రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌ వెన్నలా కరడం ఖాయం!

Loquat Fruit to Reduce Bad Cholesterol: సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ వల్ల సులభంగా గుండెపోటు సమస్యలు వస్తాయి. అయితే చాలా మందిలో కొవ్వు పేరుకుపోవడం వల్ల స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా శరీరంలో రక్త ప్రసరన ఆగిపోయే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ లొకట పండు (Loquat Fruit) ను తీసుకుంటే వేగంగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఈ పండును ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొలెస్ట్రాల్‌ తగ్గించేందుకు లొకట పండు ఎలా సహాయపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ పండు నిజంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందా..?
ఈ పండ్లు మొదట చైనా దేశీలు పండిచారు. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 20 కంటే ఎక్కువ దేశాల్లో లొకట పండును పండిస్తున్నారు. ముఖ్యంగా జపాన్, బ్రెజిల్, ఇండియా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఇటలీ, స్పెయిన్, టర్కీ ఇతర దేశాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. ఈ పండ్లను ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరం దృఢంగా కూడా మారుతుంది. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దీనిని తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ పండులో లభించే పోషకాలు:
లొకట పండు(Loquat Fruit)లో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ B6, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ప్రతి రోజూ ఈ పండును తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేస్తుంది:
లొకట పండు గుండెకు చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో ఉండే పీచు, విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం సిరల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా సులభంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా నరాలను దృఢంగా చేసేందుకు కూడా దోహదపడుతుంది. ఇందులో ఉండే గుణాలు రక్తపోటును కూడా సులభంగా నియత్రించి గుండె పని తీరును మెరుగుపరుచుతుంది. కాబట్టి గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పండును తినాల్సి ఉంటుంది.

నాడీ వ్యవస్థ సమస్యలను తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది:
ఈ పండు గుండెతో పాటు నాడీ వ్యవస్థను పని తీరును మెరుగు పరుచుతుంది. దీంతో జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు పేగులను సాఫీగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణవ్యవస్థను కూడా పెంచుతుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తింటే చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.

Also Read:  Allu Arjun Telugu Pride : బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతోన్న మెగా, నందమూరి ఫ్యాన్స్

Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News