Bad Cholesterol control: చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిందా? ఇలా చేయండి మైనంలా కరిగిపోతుంది..

Bad Cholesterol controlling Tips: శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచుకుని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవాలని వైద్యులు చెబుతారు. దీంతో గుండే సమస్యలు రావు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 17, 2024, 03:04 PM IST
Bad Cholesterol control: చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిందా? ఇలా చేయండి మైనంలా కరిగిపోతుంది..

Bad Cholesterol controlling Tips: శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచుకుని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవాలని వైద్యులు చెబుతారు. దీంతో గుండే సమస్యలు రావు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల గుండే సమస్యలు వచ్చి ప్రాణాంతకంగా మారుతుంది. ఇది హార్మోనల్ చేంజెస్, బ్యాడ్ లైఫ్ స్టైల్ ఇతర కారణాల వల్ల వస్తుంది. దీనివల్ల  కరోనరీ బ్లాకేజ్ ఏర్పడుతుంది, సడన్ హార్ట్ ఎటాక్ కి దారితీస్తుంది.సాధారణంగా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలంటే తరచుగా రక్త పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రాణాపాయం నుంచి త్వరగా బయటపడొచ్చు

లైఫ్ స్టైల్ మార్పులు..
మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల తగ్గించుకోవచ్చు అంటే ఎక్కువగా ప్రాసెస్‌ చేసిన ఫుడ్ కి దూరంగా ఉండాలి. తరచూ ఎక్సర్సైజ్ చేయడం, బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా స్మోకింగ్ కి దూరంగా ఉండాలి. దీంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి.

ఫ్యాట్..
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం మన ఫుడ్ లో ఫ్యాట్ తీసుకోవడం కూడా తగ్గించుకోవాలి. ఎక్కువ శాతం ఫ్రైడ్, ప్రాసెస్ ఫుడ్స్ లో ఎక్కువగా కొవ్వులు  కనిపిస్తాయి

ఇదీ చదవండి: వాల్ నట్స్ నానబెట్టి ఎందుకు తినాలి? అసలైన కారణం ఇదే..

ఎక్సర్సైజ్..
తరచుగా ఎక్సర్సైజ్ లో చేయడం వల్ల కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెట్టొచ్చు.  ఎక్సర్‌సైజ్ చేయటం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతాయి. దీంతో బరువు కూడా త్వరగా తగ్గిపోతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది కొలెస్ట్రాల్ మంచి లెవెల్ లో మెయింటైన్ అవుతూ ఉంటాయి. బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్ వంటివి చేస్తూ ఉండాలి.

ఇదీ చదవండి: ప్రతిరోజు తులసి టీ తాగితే కళ్లు చెదిరే  ఆరోగ్య ప్రయోజనాలు..

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువవుతే పరిస్థితి విషమిస్తే గుండెలో బ్లాకులు ఏర్పడతాయి. దీంతో డాక్టర్లు బైపాస్ వంటి సర్జరీలు సూచిస్తారు.శరీరంలోంచి చెడు కొలెస్ట్రాల్ ను బయటికి పంపించేస్తే ఆరోగ్యంగా ఉంటుంది దీనికి సరైన జీవన శైలిని అనుసరిస్తూ వైద్యుల సూచనలను కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News