Green Tea Side Effects: అతిగా గ్రీన్ టీ తాగితే వచ్చే అనారోగ్య సమస్యలేంటో తెలుసా?

Green Tea Side Effects: ప్రతిరోజూ ఉదయాన్నే చాలామంది గ్రీన్ టీ తాగుతారు. అయితే అతిగా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2022, 04:57 PM IST
Green Tea Side Effects: అతిగా గ్రీన్ టీ తాగితే వచ్చే అనారోగ్య సమస్యలేంటో తెలుసా?

Side Effects Of Green Tea: ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది గ్రీన్ టీ తాగుతుంటారు. ఇది బరువును తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా పనిచేస్తుంది. అందుకే ఎక్కువ మంది గ్రీన్ టీ తీసుకోవడానికి ఇష్టపడతారు. దీని వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో...ఈ గ్రీన్ టీని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అన్నే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అతిగా గ్రీన్ టీ (Green Tea Side Effects) తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.    

గ్రీన్ టీ ఎక్కువ తాగడం వల్ల కలిగే నష్టాలు
>>  గ్రీన్ టీ అధికంగా తీసుకుంటే చిరాకు, నీరసం, తిమ్మిర్లు వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. కడుపులో యాసిడ్ ఏర్పడుతుంది. ప్రేగు సిండ్రోమ్‌తో బాధపడుతున్న వ్యక్తులు గ్రీన్ టీని అస్సలు తాగకూడదు. 
>> గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల తలనొప్పి వస్తుంది. ఎందుకంటే అందులో ఉండే కెఫిన్ మైగ్రేన్ వ్యాధికి కారణమవుతుంది. 
>> అతిగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే నిద్ర సరిగా లేనివారు గ్రీన్ టీ తాగకూడదు. 
>> మలబద్ధకం ఉన్న వ్యక్తులు ఎక్కువ మోతాదులో గ్రీన్ టీని తీసుకోకూడదు. దీని వల్ల తీవ్ర ఇబ్బందులు పడతారు
>>  గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల హైబీపీ కూడా వచ్చే ప్రమాదం ఉంది. 

Also Read: Diet For Diabetes: మెంతి ఆకులతో కూడా మధుమేహాన్ని చెక్‌ పెట్టొచ్చు.. ఎలానో మీకు తెలుసా.? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News