Cracked Heels Remedy: వాతావరణం మారుతున్న కొద్ది శరీరంలోనూ అనేక మార్పులు జరుగుతాయి. దీని ప్రభావం చర్మంపై కూడా పడుతుంది. మరీ ముఖ్యంగా చలి కాలంలో పాదాలపై పగుళ్లు, చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు వస్తాయి. వేడి, చలి కాలం నాటి ప్రభావాల కారణంగా కాలి పగుళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. చర్మంలో నీటి శాతం తగ్గడం వల్లనే శరీరం పొడిబారడం, కాళ్లు పగుళ్లు వంటివి ఏర్పడడం జరుగుతుంది. ఆ కాళ్ల పగుళ్లను నివారించుకునేందుకు ఇంట్లోనే అనేక చిట్కాలు పాటించవచ్చు.
కొబ్బరినూనెతో మర్దన
రాత్రి పడుకునే ముందు కాళ్ల పగుళ్లకు కొబ్బరి నూనె రాయడం వల్ల మేలు జరుగుతుంది. కొద్దికొద్దిగా కొబ్బరి నూనెను పగిలిన మడమలపై రాస్తూ ఉండాలి. అలా కొబ్బరి నూనెతో మర్దన చేసిన తర్వాత కాళ్లకు సాక్స్ ధరించడం మర్చిపోవద్దు. ఉదయాన్నే నూనె రాసిన పాదాలను కడిగేయాలి.
యాపిల్ వెనిగర్ తో మేలు
పాదల పగుళ్లకు యాపిల్ వెనిగర్ మేలు చేస్తుంది. దీనికి నిమ్మరసం కలిపి అప్లే చేస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. యాపిల్ వెనిగర్ తో పాటు నిమ్మరసంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, అసిటిక్ కాంపోనెంట్ లు ఉంటాయి. ఇవి డ్రై సెల్స్ ను ఎక్స్ ఫోలియేట్ చేసి కొత్త కణాలను ఉత్తేజపరిచి చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి.
నిమ్మకాయపై తురుముతో ఒక గిన్నెలో 3 లీటర్ల నీటిలో మరిగించాలి. నీరు మరిగిన తర్వాత అందులో యాపిల్ వెనిగర్ కలిపి.. పాదాల పగుళ్లకు సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా చేస్తే పాదాల పగుళ్లు తగ్గుముఖం పడతాయి.
కలబందతో కాళ్ల పగుళ్లకు స్వస్తి
ఇంట్లో అందుబాటులో కలబంద హైడ్రేటింగ్, హీలింగ్ గుణాలు ఉన్నాయి. అవి చర్మవాధులు తగ్గడానికి సహాయపడతాయి. కలబంద గుజ్జుతో డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది. ఇందులో గ్లిజరిన్ కలపడం వల్ల పాదాలకు మంచి తేమ అందుతుంది. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు మటుమాయం అవుతాయి.
(నోట్: పైన పొందుపరిచిన సమాచారం కేవలం వైద్యుల సలహాల ద్వారా గ్రహించినది. ZEE తెలుగు NEWS ఈ సమాచారాన్ని ధ్రువీకరించడం లేదు.)
Also Read: Omicron Symptoms: ఒమిక్రాన్ సోకిన వారిలో ఆ 14 లక్షణాలు.. డెల్టాతో పోలిస్తే తీవ్రత తక్కువే!
Also Read: Aloe For Weight Loss: స్థూలకాయులకు గుడ్ న్యూస్- ఈ చిట్కాతో వెంటనే బరువు తగొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.