Belly Fat Reduce: పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు ఇవే.. ఇలా చేస్తే కొలెస్ట్రాల్‌ 6 రోజుల్లో మటు మాయం..!

Belly Fat Reduce In 6 Days: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌, పొట్ట చుట్టుకొవ్వు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు వివిధ రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2022, 01:49 PM IST
  • పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు..
  • రోజూ మూడుసార్లు తినండి
  • రాత్రి 7 గంటలలోపు భోజనం చేయండి
Belly Fat Reduce: పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు ఇవే.. ఇలా చేస్తే కొలెస్ట్రాల్‌ 6 రోజుల్లో మటు మాయం..!

Belly Fat Reduce In 6 Days: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌, పొట్ట చుట్టుకొవ్వు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు వివిధ రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం బరువు తగ్గడం కంటే.. పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం చాలా కష్టతరంగా మారింది. మార్కెట్‌ లభించే ఉత్పత్తులను వాడినా.. ఎలాంటి ప్రయోజనాలను పొందలేక పోతున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి.. ఆయుర్వేదంలో  పలు చిట్కాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆయుర్వేద పద్ధతులతో పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించుకోండి(Reduce belly fat with Ayurvedic methods)

1) రోజూ మూడుసార్లు తినండి (Eat three times a day):

బరువు తగ్గే క్రమంలో చాలా మంది భోజనం చేయడం మానేస్తారు. కానీ ఇలా చేయడం చాలా తప్పని ఆయుర్వేద నిపుణుల పేర్కొన్నారు. తినడం మానేయడం వల్ల అనోరెక్సియా వంటి శారీరక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొందరిలో హార్మోన్ల మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద సూచించిన వివరాల ప్రకారం..బరువు తగ్గడానికి భోజనం మానేయడం చాలా తప్పని పరిగణించారు. శరీరంలో శక్తిని సమత్యుల్యం చేయడానికి ప్రతి రోజూ 3 పూటలు భోజనం చేయడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారుద.

2) రాత్రి 7 గంటలలోపు భోజనం చేయండి (Eat before 7 pm):

ఆయుర్వేద నిపుణుల సూచించిన వివరాల ప్రకారం రోజూ రాత్రి 7 గంటలలోపు తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం మంచిదని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ శక్తివంతంగా తయారయ్యి దృఢంగా అవుతుంది. అంతేకాకుండా  ఉదయం పూట తాజాగా ధనాన్ని అందిస్తుంది. బరువు, పొట్ట చుట్టూ కొవ్వును నియంత్రించేకునే వారు తప్పకుండా రాత్రి 7 గంటలలోపు భోజనం చేయండి. ముఖ్యంగా భోజనంలో భాగంగా  సలాడ్, సూప్ లేదా ఆవిరితో ఉడికించిన కూరగాయలను తినాలి.

3) వ్యాయామం తప్పనిసరిగా చేయండి(Exercise is must):

బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వ్యాయామం చేయడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రోజూ వ్యాయమం చేయడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు తొలగిపోతుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజూ  సైక్లింగ్, యోగా, స్విమ్మింగ్ వంటి వ్యాయామం చేయడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

4) రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగాలి(Drink warm water every morning):

ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. వేడి నీటిలో నిమ్మ, అల్లం వేసుకుని ఉదయాన్నే క్రమం తప్పకుండా తాగితే శరీరంలో కొలెస్ట్రాల్‌ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా బాడీలో పెరుకుపోయిన టాక్సిన్స్ తొలగించి.. రోజంతా శక్తి పెంపొందిస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read:  Weight loss In 5 Days: ఎన్ని చిట్కాలు పాటించిన బరువు తగ్గలేకపోతున్నారా.. అయితే ఇలా సుభంగా 5 రోజుల్లో క్యాబేజీతో బరువు తగ్గండి..!

Also Read:  Weight loss tips in 10 days: వీటితో తయారు చేసిన రొట్టెలను తింటే పది రోజుల్లో బరువు తగ్గుతారు..!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News